‘‘ నీ ముఖం ఎలా ఉందో చూడాలి’’.. కోహ్లీని అవమానించేందుకు ఇంగ్లాండ్‌ ఫ్యాన్స్ యత్నం

England Fans Mock team india captian virat kohli
Highlights

మ్యాచ్‌ను గెలిచిన తర్వాత సంబరాలు చేసుకోవాల్సిన ఇంగ్లాండ్ అభిమానులు.. బరి తెగించారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అవమానించే యత్నం చేశారు.

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మిగిలిన బ్యాట్స్‌మెన్లు విఫలమైనప్పటికీ కోహ్లీ మాత్రం అదరగొట్టాడు. మొక్కవోనీ దీక్షతో జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. అయితే చెత్త షాట్ల కారణంగా భారత్ చేజేతులా మ్యాచ్‌ను కోల్పోయింది. మ్యాచ్‌ను గెలిచిన తర్వాత సంబరాలు చేసుకోవాల్సిన ఇంగ్లాండ్ అభిమానులు.. బరి తెగించారు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అవమానించే యత్నం చేశారు. తొలి టెస్ట్ ముగిసిన అనంతరం హోటల్‌కు వెళ్లేందుకు భారతజట్టు బస్సులో సిద్ధంగా ఉంది. అప్పటికే అక్కడికి చేరుకున్న ఇంగ్లీష్ అభిమానులు.. బస్సును అడ్డుకుని.. ‘‘మీ కోహ్లీ ఎక్కడ మాకు అండర్సన్ ఉన్నాడంటూ నినాదాలు చేశారు.. ఇప్పుడు కోహ్లీ ముఖం చూడాలని ఉందంటూ ఇంగ్లాండ్ అభిమానులు  పదే పదే నినాదాలు చేశారు.

భద్రతా సిబ్బంది వారిని వారించి అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్  అవ్వడంతో భారత అభిమానులు మండిపడుతున్నారు. మీ జట్టు గెలిస్తే సంబరాలు చేసుకోవాలి కానీ.. మా జట్టుకు అండగా నిలిచిన కోహ్లీని అవమానించడం తగదని హెచ్చరిస్తున్నారు. 
 

loader