సున్నాతో స్వీడన్ ఓడెన్.. సెమీస్‌కు ఇంగ్లండ్
స్వీడన్ జోరుకు ఇంగ్లండ్ అడ్డుకట్ట వేసింది. అటు నుంచి అటే టోర్నీ నుంచి ఇంటికి సాగనంపింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 2-0 గోల్స్ తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది.
స్వీడన్ జోరుకు ఇంగ్లండ్ అడ్డుకట్ట వేసింది. అటు నుంచి అటే టోర్నీ నుంచి ఇంటికి సాగనంపింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 2-0 గోల్స్ తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. గోల్ కీపర్ జోర్డాన్ పిక్‌ఫోర్డ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ ఇలా సెమీ ఫైనల్‌కు చేరుకోవడం ఇది మూడోసారి.
ఫస్టాఫ్‌లో ఇంగ్లండ్ ప్లేయర్ హర్రీ మగ్వీరే కొట్టిన బాల్‌ను అడ్డుకోవడంలో స్వీడన్ డిఫెన్స్ ఫెయిల్ కావడంతో అది కాస్త గోల్ అయ్యింది. మగ్వీరే 1-0తో జట్టుకు ఆధిక్యం సంపాదించిపెట్టాడు. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ఆడినప్పటికీ ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. ఆ విధంగా 1-0తో ఫస్టాఫ్ ముగిసింది.
సెకండాఫ్‌లో 58వ నిముషంలో డేలీ అల్లీ చేసిన గోల్‌తో ఇంగ్లండ్ ఆధిక్యత 2-0కు చేరుకుంది. ఆ తర్వాత గోల్ కీపర్ జోర్డాన్ పిక్‌ఫోర్డ్ అప్రమత్తత స్వీడన్‌ను ముప్పు తిప్పలు పెట్టింది. గోల్ పోస్టుపై ఎన్నిదాడులు చేసినప్పటికీ ఒక్కటంటే ఒక్క గోల్ కూడా ఇవ్వనంది. అలా స్వీడన్‌పై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది.