ఆటగాళ్ళ రేటెంతంటే.. ఇదిగో ఇంత..!

Do you know the remunerations of this football players
Highlights

ఆటగాళ్ళ రేటెంతంటే.. ఇదిగో ఇంత..!

హైదరాబాద్: సినిమా అభిమానులకు వారి ఫేవరేట్ యాక్టర్స్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసుకోవడానికి మహా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు ఆ ఇంట్రెస్ట్ ఇంకాస్త ఎక్కువ అనే చెప్పాలి. మరి ఫేమస్ ప్లేయర్స్‌ అందర్లోకి ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ అని అడిగితే సర్వసాధారణంగా వచ్చే సమాధానం అయితే మెస్సీ లేకుంటే రొనాల్డో. కానీ సరిగ్గా అక్కడే మనం టచ్ లైన్ మీద కాలేస్తున్నాం. ఇదంతా ఎందుకని ఫుట్‌బాల్‌‌ను సంపూర్ణంగా స్టడీ చేసే ఓ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆటగాళ్ళ వయస్సు, స్కోర్ చేసిన గోల్స్, క్లబ్ రిజల్ట్స్, లీగ్ ఇలా అనేక అంశాలను బేస్ చేసుకొని వారి విలువను యూరోల్లో లెక్క కట్టింది.ఆ ప్రకారం చూసినప్పుడు 201.2 మిలియన్ యూరోలతో ఇంగ్లీష్ స్ట్రయికర్ హ్యారీ కేన్ అత్యంత విలువైన ప్లేయర్‌గా టాప్ ప్లేస్‌లో నిలిచాడు. 197.5 మిలియన్లతో బ్రెజిల్ అద్భుత ప్రేయర్ నేమర్, 186.5 మిలియన్లతో కెలియన్ బప్పే తర్వాతి స్థానాలు దక్కించుకున్నారు. 


స్పానిష్ క్లబ్ ఎఫ్‌సి బార్సెలోనా తరఫు అర్జెంటీనా వీరుడు లియెనెల్ మెస్సీ 184.2 మిలియన్ యూరోలతో నాలుగో స్థానానికి పరిమితమైపోయాడు. లివర్‌పూల్ తరఫున ఆడుతున్న 25 ఏళ్ళ ఈజిప్టు ఆటగాడు మహమ్మద్ సలా 171.3 మిలియన్లతో టాప్ ఫైవ్‌లో లాస్ట్ ప్లేస్‌లో సెటిలైపోయాడు. 22 ఏళ్ళ ఇంగ్లీష్ మిడ్ ఫీల్డర్ డెలె అల్లీ 171 మిలియన్ యూరోలతో ఆరవ స్థానాన్ని దక్కించుకున్నాడు. టాప్ 10లో చివరి నాలుగు స్థానాలను 167.2 మిలియన్లతో బెల్జియం మిడ్ ఫీల్డర్ కెవిన్ డె బ్రూనె, 164.5 మిలియన్లతో ఫ్రెంచ్ ఫార్వార్డ్ ప్లేయర్ ఆంటోనియో గ్రిజ్‌మన్, 164.2 మిలియన్లతో అర్జెంటీనా ఫార్వార్డ్ ప్లేయర్ పాలో డైబాలా, 163.4 మిలియన్ యూరోలతో బెల్జియం ఆటగాడు రొమెలు లుకాకా వరుసగా నిలిచారు.టాప్ 100లో పేరున్న ఆటగాళ్ళుపోర్చుగల్, రియల్ మాడ్రిడ్ తరఫున ఆడుతున్న 33 ఏళ్ళ క్రిస్టియానో రొనాల్డో 103.4 మిలియన్ యూరోలోత 24వ స్థానంలో నిలిచాడు. రొనాల్డో కన్నా పై స్థానాల్లో పాల్ పొగ్బో(144.9 మిలియన్ యూరోలు), లూయిస్ సురెజ్(120.4 మిలియన్ యూరోలు) ఉన్నారు.

loader