యాంటీ డోపింగ్ టెస్టుల్లో ఫెయిల్: దీపాకర్మాకర్ పై 21 నెలల నిషేధం
యాంటీ డోపింగ్ టెస్టుల్లో ఫెయిల్ అయినందున భారత జిమ్నాస్టర్ దీపా కర్మాకర్ పై 21 మాసాల పాటు ఐటీఏ 21 నెలల పాటు నిషేధం విధించింది.

న్యూఢిల్లీ: యాంటీ డోపింగ్ టెస్టుల్లో ఫెయిల్ అయినందున భారత జిమ్నాస్టర్ దీపా కర్మాకర్ పై 21 నెలల పాటు ఐటీఏ నిషేధం విధించింది. దీపా కర్మాకర్ యాంటీ డోపింగ్ టెస్టులో ఫెయిలైంది. ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ ఫెడరేషన్ నిర్ధేశించిన మార్గదర్శకాలను దీపా కర్మాకర్ అనుసరించడంలో ఫెయిల్ అయ్యారు. దీంతో ఈ ఏడాది జూలై 10 వ తేదీ వరకు ఆమెను సస్పెండ్ చేశారు.. 2016 లో రియో ఒలంపిక్స్ లో దీపా కర్మాకర్ నాలుగో స్థానంలో నిలిచారు.
దీపా కర్మాకర్ హైజెనామైన్ పరీక్షలో పాజిటివ్ గా తేలింది. 2021 అక్టోబర్ 11న దీపా కర్మాకర్ నుండి శాంపిల్స్ సేకరించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనే అథ్లెట్లు, రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్‌టీపీ) కింద రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా రిజిస్టర్ అయిన ప్రతీ అథ్లెట్, ప్రతీ ఏడాది యాంటీ డోపింగ్ టెస్టు కోసం నమూనాలు సమర్పించాల్సి ఉంటుంది. సాంపిల్స్ సమర్పించకపోతే వారిపై ఏడాది నుంచి రెండేళ్ల వరకూ నిషేధం పడుతుంది.