ఒక్క స్టెప్పుతో.. తండ్రికి మించిన పాపులారిటీ కొట్టేసిన ధోనీ కూతురు (వీడియో)

First Published 21, Jul 2018, 1:41 PM IST
dhoni daughter ziva dance
Highlights

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గారాలపట్టి జీవా మరోసారి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపింది

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గారాలపట్టి జీవా మరోసారి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపింది. కేంద్ర మాజీ మంత్రి ప్రపుల్ పటేల్ కుమార్తె పూర్ణ పటేల్ వివాహం ముంబైలో నిన్న అట్టహాసంగా జరిగింది. ధోనీ భార్య సాక్షి.. పూర్ణ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు కావడంతో పెళ్లి సాక్షి కుటుంబంతో కలిసి హాజరయ్యింది.

మెహందీ కార్యక్రమంలో భాగంగా సాక్షి కాలు కదిపారు.. ఆ సమయంలో తల్లిని చూసి జీవా కూడా కొన్ని స్టెప్పులు వేయడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. సాక్షి కొన్ని స్టెప్పులు చూపిస్తే వాటిని వేసేందుకు జీవా ప్రయత్నించడంతో అక్కడున్న వారంతా చప్పట్లతో మారుమ్రోగించారు. గతంలోనూ జీవా ఎన్నోసార్లు స్టెప్పులు వేసిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. 

"

loader