ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చెల్లింపుల్లో ధోనీ రికార్డు.. ఈ ఏడాదిదే కాదు.. వచ్చే ఏడాదిది కూడా కట్టేశాడు

dhoni become biggest tax payer in jharkhand
Highlights

జట్టును ముందుండి నడిపించి ఎన్నో విజయాలు అందుకుని.. ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపడమే కాదు.. పౌరుడిగా దేశం పట్ల తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ..

జట్టును ముందుండి నడిపించి ఎన్నో విజయాలు అందుకుని.. ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపడమే కాదు.. పౌరుడిగా దేశం పట్ల తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ.. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా రూ.12.17 కోట్ల ఆదాయపు పన్నును కట్టాడు మహీ.. తద్వారా జార్ఖండ్‌లో ఈ ఏడాది అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

అంతేకాకుండా వచ్చే ఆర్థిక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3 కోట్ల అడ్వాన్స్‌ ట్యాక్స్‌ను ముందే డిపాజిట్ చేసినట్లు ఆ రాష్ట్ర ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. 2017లో చెల్లించిన దానికంటే ఇది 1.24 కోట్లు ఎక్కువ.. 2017లో ధోనీ రూ.63.7 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాడు.

ధోనీకి ‘ధోనీ సెవెన్’ అనే బ్రాండ్‌ దుస్తుల వ్యాపారంతో పాటు హాకీ ఇండియాలో రాంచీ రేస్, ఇండియన్ సూపర్‌బాల్ లీగ్‌లో చెన్నై ఎఫ్‌సీ ఫుట్‌బాల్ ప్రాంచైజీలకు ధోనీ కో పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇవే గాక అనేక కంపెనీల ఉత్పత్తులకు మహీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఫోర్బ్స్‌ ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే భారత క్రికెటర్ల జాబితాలో కోహ్లీ, సచిన్‌ తర్వాత ధోనీ మూడో స్థానంలో ఉన్నాడు.

loader