పాకిస్థాన్ నిషేధిత క్రికెటర్, స్పిన్నర్ డానిష్ కనేరియా మ్యాచ్ తాను తప్పు చేసినట్లు అంగీకరించాడు. తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని పాక్ క్రికెట్ బోర్డ్, అభిమానులు, దేశ ప్రజలను కోరుకుంటున్నానని.. దయ చేసి తనను క్షమించాలని వేడుకున్నాడు..

ఆరేళ్ల నుంచి ఆబద్ధాలు చెబుతున్నాను.. ఇప్పుడు నిజం చెప్పడానికి ధైర్యం కావాలి. నాకెంతో భారంగా ఉంది. అందుకే ఇప్పుడు నిజం చెబుతున్నా.. స్పాట్ ఫిక్సర్ అని తాను ఇక పిలిపించుకోలేను.. ఇక ఎంత మాత్రమూ ఖండించనూ లేను... బుకీ అనుభట్‌ను కలిసి పెద్ద తప్పు చేశా..

ఈ విషయాన్ని అధికారులకు చెప్పకుండా.. భారీ మూల్యం చెల్లించుకున్నా.. యువ ఆటగాళ్లు ఇలాంటి ఘోరమైన తప్పిదాలు చేయొద్దని వేడుకుంటున్నా అని కనేరియా మీడియాకు తెలిపాడు.

కనేరియాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది.. తన స్పిన్ మాయాజాలంతో జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు.. 2010లో ఇంగ్లాండ్‌‌తో టెస్టు సందర్భంగా కనేరియా, సల్మాన్ భట్, మహ్మద్ ఆసిఫ్, మహ్మాద్ ఆమిర్ స్పాట్ ఫిక్సింగ్‌‌కు పాల్పడి ఐదేళ్ల పాటు నిషేధానికి గురై.. క్రికెట్‌కు దూరమయ్యారు. డానిష్ కనేరియా 61 టెస్టుల్లో 261 వికెట్లు తీశాడు