విరాట్ కోహ్లీపై ధోనీ సూపర్: అంబటి రాయుడు రికార్డు

విరాట్ కోహ్లీపై ధోనీ సూపర్: అంబటి రాయుడు రికార్డు

పూణే: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా శనివారం జరిగిన మ్యాచులో విరాట్ కోహ్లీపై ధోనీ మరోసారి సూపర్ అనిపించుకున్నాడు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.

మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేసింది. 128 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రారంభంలోనే వికెట్ కోల్పోయింది. ఉమేష్ యాదవ్ వేసిన మూడో ఓవర్ చివరి బంతికి వాట్సన్ (11) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత సురేష్ రైనా దూకుడుగా ఆడి 25 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగులో అవుటయ్యాడు.

ఆ తర్వాత మురగన్ అశ్విన్ వేసిన బంతికి 12వ ఓవరులో అంబటి రాయుడు 32 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్ాడు. ఈ దశలో ధోనీ నిలబడి బ్రావోతో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 

ధోనీ 23 బంతుల్లో 3సిక్సులు, 1 ఫోర్ కొట్టి 31 పరుగులు చేశాడు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ 18 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. తద్వారా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

అంబటి రాయుడు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుపై శనివారం జరిగన మ్యాచులో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ ఐపిఎల్ సీజన్ లో 400కు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా అతను రికార్డు సృష్టించాడు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM SPORTS

Next page