క్రికెట్ ప్రపంచ కప్ 2023 : సెంచరీ మిస్ చేసిన శుభ్‌మాన్ గిల్.. వైరల్ గా సారా టెండూల్కర్ రియాక్షన్...
క్రికెట్ వరల్డ్ కప్ 2023లో భారత్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఆట చూడడానికి సారా సారా టెండుల్కర్ తన స్నేహితులతో కలిసి వచ్చింది.
ముంబై : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండూల్కర్, క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ మంచి స్నేహితులు. వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందని ప్రచారం ఉంది. కానీ దీనిమీద ఇద్దరూ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా, గురువారం వాంఖడేలో జరిగిన మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ సెంచరీని ఎనిమిది బంతుల అత్యంత సమీపంలోకి వచ్చి మిస్ ఔట్ అయ్యాడు.
అప్పటివరకు శుభ్ మన్ కు ఉత్సాహాన్నిచ్చింది సారా. అతను ఔట్ అవ్వడంతో ఒక్కసారిగా ఆమె ముఖం వాడిపోయింది. ఆ తరువాత గిల్ డ్రెస్సింగ్ రూమ్ కు వెడుతుంటూ.. స్టాండింగ్ ఓవిషేన్ ఇచ్చింది. చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో, సారా రియాక్షన్ వైరల్ గా మారింది.
శుభ్‌మాన్ గిల్ తన మొదటి ఓడీఐ క్రికెట్ ప్రపంచ కప్ సెంచరీకి అతి చేరువగా వచ్చి ఔటయ్యాడు. గురువారం భారత్, శ్రీలంక మధ్య జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌లో దిల్షాన్ మధుశంక చేతిలో అవుట్ అయ్యాడు. శ్రీలంక బౌలర్లపై 11 ఫోర్లు, రెండు భారీ సిక్సర్లతో చెలరేగడంతో గిల్ అద్భుతమైన ఫామ్ లో కనిపించాడు. సెంచరీ ఖాయం అనుకున్న దశలో కేవలం ఎనిమిది పరుగుల దూరంలో ఉండగా, బంతిని నేరుగా వికెట్ కీపర్ కుసాల్ మెండిస్‌కు స్టంప్స్ వెనుక ఎడ్జ్ చేశాడు.
ఇది చూసిన ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు గిల్ ఔట్‌తో ఆశ్చర్యపోయారు. సారా టెండూల్కర్ కూడా అలాగే స్పందించింది. మొహానికి చేతులు అడ్డుపెట్టుకుని తన నిరాశను వ్యక్తపరిచింది. కాసేపటికే తేరుకుని చప్పట్లతో స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.