సెనెగల్ ఔట్.. కొలంబియా ఇన్..(వీడియో)

Colombia beat Senegal
Highlights

సెనెగల్ ఔట్.. కొలంబియా ఇన్..!

హైదరాబాద్: కొలంబియా, సెనెగల్‌పై 1-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. ఆరు పాయింట్లు సాధించి గ్రూప్ హెచ్‌లో ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. నాకౌట్‌కు క్వాలిఫై అయ్యింది. గ్రూప్ నుంచి సెనెగల్ నిష్క్రమించింది. ఈ అనూహ్యమైన పరిణామాలకు గురువారం నాటి మ్యాచ్ వేదికగా మారింది. కొలంబియా డిఫెండర్ యెర్రి మినా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఫస్టాఫ్‌లో గోల్ చేయడానికి రెండు జట్లు శతవిధాలుగా ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. సెకండాఫ్‌లో 74వ నిమిషం దాకా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. సరిగ్గా అదే సమయానికి కొలంబియా డిఫెండర్ యెర్రి మినా పెనాల్టీ కార్నర్ నుంచి కొట్టిన బాల్‌ను అనూహ్యమైన రీతిలో హెడ్ కిక్ తో నెట్‌లోకి నెట్టాడు. 1-0 స్కోరుతో జట్టుకు విజయాన్ని అందించాడు. 

"

loader