Asianet News TeluguAsianet News Telugu

ఇంగ్లాండ్ క్రికెటర్లకు తప్పిన ప్రమాదం... గ్రౌండ్‌లో విష సర్పం ప్రత్యక్షం (వీడియో)

వన్డే, టీ20, టెస్ట్ సీరిస్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే మూడో వన్డే మ్యాచ్ కోసం ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్న ఇంగ్లాండ్ క్రికెటర్లకు పెను ప్రమాదం తప్పింది. అయితే పల్లెకలె స్టేడియంలోని  సిబ్బంది అప్రమత్తమవడంతో వారికి ప్రమాదం తప్పింది.
 
Cobra disrupts England cricket team's practice session in Sri Lanka
Author
Pallekele, First Published Oct 15, 2018, 5:19 PM IST

వన్డే, టీ20, టెస్ట్ సీరిస్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే మూడో వన్డే మ్యాచ్ కోసం ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్న ఇంగ్లాండ్ క్రికెటర్లకు పెను ప్రమాదం తప్పింది. అయితే పల్లెకలె స్టేడియంలోని  సిబ్బంది అప్రమత్తమవడంతో వారికి ప్రమాదం తప్పింది.

ఆతిథ్య శ్రీలంకతో పల్లెకలె స్టేడియంలో  ఈనెల 17న జరగనున్న మూడో వన్డేలో ఇంగ్లాండ్ జట్టు తలపడనుంది. ఇందుకోసం ఇంగ్లాండ్ ఆటగాళ్లు గ్రౌండ్‌లో సీరియస్ ప్రాక్టీస్‌లో ఉండగా ఓ విషపూరిత సర్పం కలకలం సృష్టించింది. గ్రౌండ్ లోకి ప్రవేశించిన పామును సిబ్బంది గమనించడంతో ప్రమాదం తప్పింది. ఈ పామును సిబ్బంది పట్టుకుని బయట
వదిలేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.  

 ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు ఇవాళ ఉదయం ప్రాక్టీస్ చేస్తుండగా అనుకోని అతిథి గ్రౌండ్ లోకి ప్రవేశించిందంటూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పేర్కొంది. గ్రౌండ్ లోకి ప్రవేశించిన పామును సిబ్బంది పట్టుకుంటున్న వీడియోను అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. 

వీడియో

Follow Us:
Download App:
  • android
  • ios