డ్యాన్స్ లతో అదరగొట్టిన  గబ్బర్‌-గేల్‌ వీడియో వైరల్

అద్భుతమైన ఆటతోపాటు విలక్షణమైన యాటిట్యూడ్‌తోనూ అభిమానుల్ని అలరించడంలో ముందుంటారు జమైకన్‌ క్రిస్‌గేల్‌, ఇండియన్‌ ‘గబ్బర్‌’ శిఖర్‌ ధావన్‌! మొన్నటి ఐపీఎల్‌లో వేర్వేరు జట్ల తరఫున ఆడిన ఈ దిగ్గజాలు.. వేదిక మారగానే ఒక్కటైపోయారు. ఇటీవల ముంబైలో జరిగిన సియాట్‌ అవార్డుల ఫంక్షన్‌లో ‘జుమ్మా..చుమ్మా..’ పాటకు స్టెప్పులేసి ఇరగదీశారు. గబ్బర్‌-గేల్‌ల సందడి వీడియో వైరల్‌ అయింది.

 పంజాబీ స్టైల్‌లో తలపాగా ధరించిన క్రిస్ గేల్‌ను ధావన్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. ‘‘చూడండి.. జమైకా దలేర్‌ మెహందితో సెల్ఫీదిగా. మనసంతా బోలో తారారారా..’’అని గబ్బర్‌ ట్వీట్‌ చేశాడు. ఐపీఎల్‌ 2018లో కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ తరుఫున 11 మ్యాచ్‌లు ఆడిన గేల్‌.. ఒక సెంచరీ, రెండు అర్థసెంచరీలతో మొత్తం 368 పరుగులు చేశాడు. ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌గా 16 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగిన శిఖర్‌ ధావన్‌ నాలుగు హాఫ్‌ సెంచరీలతో మొత్తం 497 పరుగులు చేశాడు."