Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌‌గా కోనేరు హంపి

ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ టైటిల్ ను కోనేరు హంపి దక్కించుకొన్నారు. రష్యాపై ఆమె విజయం సాధించి టైటిల్ ను పొందారు.

Carlsen, Koneru Win World Rapid Chess Championships
Author
Moscow, First Published Dec 29, 2019, 7:02 AM IST

మాస్కో: ప్రపంచ రాపిడ్ చెస్ చాంపియన్ షిప్‌ను కోనేరు హంపి దక్కించుకొన్నారు. శనివారం నాడు ముగిసిన ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్ పోటీలో ఆమె ప్లేఆఫ్స్ లో చైనా గ్రాండ్ మాస్టర్ లీ టింగ్‌జీని ఓడించి టైటిల్‌ను అందుకొన్నారు. 

ఇటీవలే మొనాకో లో గ్రాండ్ ఫ్రీ చెస్ టైటిల్ గెలుచుకొంది కోనేరు హంపి. ఆ తర్వాత ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్ ను గెలుపొందింది. 12 రౌండ్ల ఈ టోర్నీలో ఆఖరి రౌండ్  తర్వాత హంపి 9 పాయింట్లతో చైనా గ్రాండ్ మాస్టర్ లీ టింగ్ జీ ఎక్తరీనా తో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచింది.

మెరుగైన టైబ్రేక్ స్కోరు కారణంగా పసిడి పతకం కోసం పోరాడే అవకాశం హంపి, లీ టింగ్‌జీలకు దక్కింది. హంపి, లీ టింగ్ జీ లు బాగా ఆడడంతో తొలి ప్లేఆఫ్ డ్రా అయింది.

దీంతో రెండో సారి ప్లేఆఫ్ ఆడాల్సి వచ్చింది. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా హంపి ఎత్తులు వేసింది. దీంతో ఈసారి లీ టింగ్‌జీ ఓటమి ఒప్పుకోకతప్పలేదు.మరో గ్రాండ్ మాస్టర్ ఎక్తరీనా కాంస్యపతకాన్ని దక్కించుకొన్నారు.

మ్యాచ్ చివరి రౌండ్ లో  జోంగ్‌యి ను హంపి ఓడించింది. చైనాకు చెందిన జోంగ్ యిను ఓడించడంతో అప్పటికి అగ్రస్థానంలో ఉన్న లీ టింగ్ జీ  ఎక్తరీనా చేతిలో ఓడిపోవడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.

అయితే మరో గ్రాండ్ మాస్టర్ ద్రోణవవల్లి హారిక 8 పాయింట్లతో ఉమ్మడిగా ఐదో స్థానంలో నిలిచింది.  చివరి రౌండ్‌లో  ఎలిజబెత్ పై హారిక విజయం సాధించారు. 
పురుషుల ర్యాపిడ్ విభాగంలో మాగ్నస్ కార్ల్‌సన్ టైటిల్ సాధించారు. 11 పాయింట్లతో కార్ల్‌సన్ అగ్రస్థానంలో నిలిచారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios