BWF వరల్డ్ ఛాంపియన్‌షిప్స్: ప్రణయ్ వర్సెస్ లక్ష్యసేన్... క్వార్టర్ ఫైనల్‌లోకి అర్జున్- ధృవ్ జోడి...

అంచనాలకు మించి రాణించి, ప్రీ క్వార్టర్ ఫైనల్‌కి చేరిన భారత మెన్స్ డబుల్స్ జోడీ ఎంఆర్ అర్జున్-ధృవ్ కపిల జోడి... మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్ వర్సెస్ ప్రణయ్ పోరాటం.. 

BWF World championship 2022: HS Prannoy going to face Lakshya sen in Mens Single Pre Quarters

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ 2022 టోర్నీలో భారత మెన్స్ డబుల్స్ జోడీ ఎంఆర్ అర్జున్-ధృవ్ కపిల జోడి అద్భుత విజయాలతో క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. వరల్డ్ 41 ర్యాంకింగ్ సింగపూర్ జోడీతో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 18-21, 21-15, 21-16 తేడాతో అద్భుత విజయం అందుకుంది అర్జున్ - ధృవ్ కపిల జోడి...

క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ‘ది డాడీస్’గా పేరొందిన ఇండోనేషియా జోడీ హెండ్రా సెటివన్- మహ్మద్ అహ్సన్‌తో తలబడబోతున్నారు అర్జున్ - ధృవ్ కపిల. అంతకుముందు మెన్స్ డబుల్స్‌  రెండో రౌండ్‌లో అర్జున్ - ధృవ్ కపిల జోడి సంచలన విజయం అందుకుంది. వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ కాంస్య పతక విజేతలు, వరల్డ్ నెం.8 డానిష్ జోడీ కిమ్ అస్రప్ - అండర్స్ రస్మెసన్‌తో జరిగిన మ్యాచ్‌లో  21-17, 21-16 తేడాతో సంచలన విజయం అందుకుని ప్రీ క్వార్టర్ ఫైనల్‌కి అర్హత సాధించారు...

మెన్స్ సింగిల్స్‌లో భారత జట్టు ప్లేయర్లు హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్... ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో ఒకరినొకరు తలబడబోతున్నారు. రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్‌‌గా నిలిచిన కెంటో మొమొటాతో జరిగిన మ్యాచ్‌లో 21-17, 21-16 తేడాతో సంచలన విజయం అందుకున్నాడు హెచ్ ఎస్ ప్రణయ్.. గత 9 మ్యాచుల్లో కెంటో మొమొటాపై ప్రణయ్ గెలవడం ఇదే తొలిసారి...  

మరోవైపు కామన్వెల్త్ గేమ్స్ 2022 గోల్డ్ మెడల్‌తో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో అడుగుపెట్టిన లక్ష్యసేన్, ప్రీ క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్‌లో వరల్డ్ 74వ ప్లేయర్ల, స్పానిషన్ షెట్లర్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-17, 21-10 తేడాతో సునాయాస విజయం అందుకున్నాడు లక్ష్యసేన్...

ఈ ఇద్దరూ మెన్స్ సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో తలబడబోతున్నారు. ఇప్పటికే భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్, బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రెండో రౌండ్ నుంచే ఇంటిదారి పట్టాడు. మెన్స్ సింగిల్స్‌లో మిగిలిన లక్ష్యసేన్, హెచ్‌ఎస్ ప్రణయ్‌ ఇద్దరూ ఒకరినొకరు తలబడుతుండడంతో వీరిలో ఒకరు మాత్రమే క్వార్టర్ ఫైనల్‌కి వెళ్లబోతున్నారు.

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌‌ 2022లో వుమెన్స్ డబుల్స్‌లో భారత ప్లేయర్ల పోరాటం ముగిసింది. రెండో రౌండ్‌లో వరల్డ్ 11 ర్యాంక్ మలేషియా జోడితో జరిగిన మ్యాచ్‌లో 8-21, 17-21 తేడాతో ఓటమి పాలయ్యారు గాయత్రి గోపిచంద్- త్రీషా జాలీ... 

మరో భారత జోడి అశ్విని పొన్నప్ప- సిక్కీ రెడ్డి, వరల్డ్ నెం.1 జోడీతో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో 15-21, 10-21 తేడాతో పోరాడి ఓడారు. అలాగే పూజా దండు- సంజన సంతోష్ పోరాటం కూడా రెండో రౌండ్‌లోనే ముగిసింది. వరల్డ్ నెం.3 ర్యాంక్ జోడీ జరిగిన మ్యాచ్‌లో 15-21, 7-21 తేడాతో ఓటమి పాలయ్యారు పూజా- సంజన..  అశ్విని భట్ -శిఖా గౌతమ్, ఒలింపిక్ మెడిలిస్ట్, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ దక్షిణ కొరియో జోడీ కాంగ్ హీ యంగ్- యంగ్ కిమ్‌తో జరిగిన  మ్యాచ్‌లో 5-21, 21-18, 13-21 తేడాతో పోరాడి ఓడారు అశ్విని భట్ - శిఖా గౌతమ్... వీరి ఓటమితో వుమన్స్ డబుల్స్‌లో భారత పోరాటం ముగిసినట్టైంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios