2032లో జరిగే ఒలింపిక్స్ కి వేదికగా ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరం ఎంపికైంది.

2032లో జరిగే ఒలింపిక్స్ కి వేదికగా ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరం ఎంపికైంది. 35వ ఒలింపియాడ్ నిర్వహించేందుకు బ్రిస్బేన్ నగరాన్ని ఎంపిక చేసినట్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య ప్రకటించింది. 

ఈ విషయం ప్రకటించగానే అక్కడున్న బ్రిస్బేన్ నగర అధికారులు సంతోషంతో కరతాళధ్వనులు చేసారు. అంతే కాకుండా బ్రిస్బేన్ నగర పేరు లైవ్ లో టీవీ మీద ప్రకటించగానే బ్రిస్బేన్ లో గుమికూడిన ప్రజలు ఆనందంలో గంతులేశారు. టపాకాయలు కాలుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. 

Scroll to load tweet…

అమెరికా తరువాత మూడు నగరాల్లో ఒలింపిక్స్ ని నిర్వహించిన రెండవ దేశంగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించనుంది. గతంలో 1956 ఒలింపిక్స్ ని మెల్బోర్న్ లో నిర్వహించగా... 2000 ఒలింపిక్స్ ని సిడ్నీ నగరంలో నిర్వహించారు. ఇప్పుడు బ్రిస్బేన్ నగరంతో కలుపుకొని ఆస్ట్రేలియా కూడా మూడు నగరాల్లో నిర్వహించినట్టవుతుంది. 

ఇండోనేషియా,హంగేరి,చైనా,కతర్,జర్మనీ లు పోటీపడగా... అన్ని దేశాలను వెనక్కి నెడుతూ... బ్రిస్బేన్ ఈ అవకాశాన్ని దక్కించుకుంది. కావలిసినన్ని వేడుకలు అందుబాటులో ఉండడం,వాతావరణ పరిస్థితులు, ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ సహకారం,ఇంతకు ముందు ఇటువంటి మెగా ఈవెంట్లు నిర్వహించిన అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకొని బ్రిస్బేన్ ని ఎంపిక చేసారు నిర్వాహకులు.