అందరూ అనుకున్నట్లుగానే టీమిండియా ఆసియాకప్‌ను గెలిచింది. ఇంకేముంది భారత్ జైత్రయాత్రను ఎవరూ అడ్డుకోలేరు.. ప్రపంచంలో అత్యుత్తమ జట్టు మనదేనంటూ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు.

కానీ.. కప్ గెలిచిన సందర్భంలో భారత జట్టు వైఫల్యాలను సగటు అభిమాని మరచిపోతున్నాడు. ఈ కప్‌ను నిజంగా గెలిపించింది ఎవరు అని ఒకసారి ప్రశ్నించుకుంటే.. ఆసియా కప్‌ను బౌలర్లే గెలిపించారు అని చెప్పవచ్చు.

అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు దాదాపు ప్రతీ మ్యాచ్‌లో ప్రత్యర్థి భారీ స్కోరు సాధించకుండా నిలువరించారు. అందువల్లే బ్యాట్స్‌మెన్ పని కొంత సులువు అయ్యింది. మిడిలార్డర్‌ ప్రతిసారి విఫలమైంది...రోహిత్, ధావన్, కోహ్లీ లాంటి స్టార్లు విఫలమైతే భారతజట్టుకు పరాజయం తప్పదు అనే విషయం కూడా అర్థమైంది.

ఇక ఈ టీమిండియా మాజీ సారథి ధోనీ ఆట చూస్తే... అతని వీరాభిమానులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.. మహికి టైమ్ వచ్చేసింది అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

నాలుగు ఇన్నింగ్సుల్లో కలిపి అతను 77 పరుగులే చేశారు.. ప్రతీ పరుగు కోసం ఎంతో ఇబ్బంది పడ్డాడు. ఫైనల్లో 124 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు తప్పించి ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం ధోనీ స్థాయికి  ఏమాత్రం తగదు అని విశ్లేషకులు అంటున్నారు. 

ఆసియా కప్ భారత్ దే: మూడోసారీ బంగ్లాదేశ్ కు నిరాశే

రోహిత్ కు మొండిచేయి: గంగూలీ ఆగ్రహం

ఆటగాళ్ల దయనే, నాదేమీ లేదు: ఆసియా కప్ విజయంపై రోహిత్

వెస్టిండీస్ తో టెస్టు సిరీస్: రోహిత్ కు మళ్లీ చేయి, ధావన్ ఔట్