క్రికెట్‌లో సంచలనం.. 18 పరుగులకే అలౌట్.. 12 నిమిషాల్లో చేజింగ్

First Published 24, Jul 2018, 3:16 PM IST
beckenham team allout for only 18 runs
Highlights

బ్యాటింగ్ చేస్తున్న జట్టు కేవలం 18 పరుగులకే అలౌట్ అయితే.. అవతలి జట్టు 12 నిమిషాల్లోనే టార్గెట్ ఫినిష్ చేస్తే.. ఇదంతా జోక్ కాదు.. కలలో జరిగింది అసలే కాదు. 

బ్యాటింగ్ చేస్తున్న జట్టు కేవలం 18 పరుగులకే అలౌట్ అయితే.. అవతలి జట్టు 12 నిమిషాల్లోనే టార్గెట్ ఫినిష్ చేస్తే.. ఇదంతా జోక్ కాదు.. కలలో జరిగింది అసలే కాదు. క్రికెట్ చరిత్రలో ఎవరి ఊహాకు అందని ఈ ఘటన ఇంగ్లాండ్ కౌంటీల్లో చోటు చేసుకుంది. షెపర్డ్ నీమే కెంట్ క్రికెట్‌ లీగ్‌లో భాగంగా బెకన్హమ్, బెక్స్‌లీ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెకన్హమ్ జట్టు.. బెక్స్‌లీ బౌలర్ల ధాటికి పేక మేడలా కూలిపోయింది.

బ్యాట్స్‌మెన్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు చేరిపోయారు.. చివరికి 42 నిమిషాల సమయంలో 18 పరుగులకే ఆ జట్టు అలౌటైపోయింది. బెకన్హమ్ జట్టులో ఐదుగురు బ్యాట్స్‌మెన్ అలౌటవ్వగా.. ముగ్గురు బ్యాట్స్‌మెన్ తలో నాలుగు పరుగులు చేశారు.. బెక్స్‌లీ బౌలర్లలో కాలమ్ మాక్‌లీడ్ ఆరు ఓవర్లు వేసి ఆరు వికెట్లు తీశాడు.

అనంతరం లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన బెక్స్‌లీ కేవలం 3.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా టార్గెట్ ఫినిష్ చేసింది.. ఈ జట్టు బ్యాటింగ్ చేయడానికి తీసుకున్న మొత్తం సమయం 12 నిమిషాలే. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ గురించి క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా చర్చించుకుంటోంది. 

loader