Asianet News TeluguAsianet News Telugu

బీసీసీఐ సంచలన నిర్ణయం.. చేతన్ శర్మతో సహా సీనియర్ సెలక్షన్ కమిటీ ఔట్ !

BCCI: బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ క్రికెటర్‌ చేతన్‌ శర్మ సారధ్యంలోని నలుగురు సభ్యుల సీనియర్‌ నేషనల్‌ సెలెక్షన్‌ కమిటీని రద్దు చేసింది. టీ20 ప్రపంచకప్ 2022లో ఫైన‌ల్ చేర‌కుండా భారత్ ఓటమి క్ర‌మంలోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం. 
 

BCCIs sensational decision.. Senior Selection Committee including Chetan Sharma out!
Author
First Published Nov 19, 2022, 12:32 AM IST

BCCI-Chetan Sharma: ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ క‌ప్ లో భారత జట్టు ఫైనల్ కు చేరుకోవడంలో విఫలమైన నేపథ్యంలో సీనియ‌ర్ క్రికెట‌ర్ చేతన్ శర్మ నేతృత్వంలోని నలుగురు సభ్యుల సీనియర్ జాతీయ సెలెక్షన్ కమిటీని బీసీసీఐ శుక్రవారం తొలగించింది. ఈ క్ర‌మంలోనే జాతీయ సెలక్టర్ల (సీనియర్ మెన్) స్థానం కోసం బీసీసీఐ శుక్రవారం కొత్త దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 28గా ప్ర‌క‌టించింది.

 

వివ‌రాల్లోకెళ్తే.. బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ క్రికెటర్‌ చేతన్‌ శర్మ సారధ్యంలోని నలుగురు సభ్యుల సీనియర్‌ నేషనల్‌ సెలెక్షన్‌ కమిటీని రద్దు చేసింది. టీ20 ప్రపంచకప్ 2022లో ఫైన‌ల్ చేర‌కుండా భారత్ ఓటమి క్ర‌మంలోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం. కాగా, ఇటీవ‌ల టీ20 ప్ర‌పంచ క‌ప్ టోర్నీ ఆస్ట్రేలియా జ‌రిగింది. అయితే, భార‌త్ జ‌ట్టు ఫైన‌ల్ కు చేరుకోకుండానే ఇంటిదారి ప‌ట్టింది. దీనికి ప్ర‌ధాని కార‌ణం జ‌ట్టు కూర్పు స‌రిగ్గా లేక‌పోవ‌డ‌మేన‌ని మాజీ క్రికెట‌ర్ల‌తో పాటు క్రీడా విశ్లేష‌కులు సైతం పేర్కొన్నారు. భారత జట్టు సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో ఘోర ఓటమిని ప్ర‌స్తావిస్తూ ప‌లువురు సీనియ‌ర్ నాయ‌కులు ఘాటుగానే విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ క్ర‌మంలోనే దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) మాజీ సీనియ‌ర్ క్రికెట‌ర్ చేత‌న్ శ‌ర్మ సార‌ధ్యంలోని నలుగురు సభ్యుల సీనియర్‌ నేషనల్‌ సెలెక్షన్‌ కమిటీని రద్దు చేసింది. ఈ సెల‌క్ష‌న్ క‌మిటీలో సునీల్‌ జోషి (సౌత్ జోన్), హర్విందర్ సింగ్ (సెంట్రా జోన్), దెబాశిష్‌ మొహంతీ (ఈస్ట్ జోన్), చేతన్‌ శర్మ (నార్త్ జోన్) సభ్యులుగా ఉన్నారు. ఈ సెల‌క్ష‌న్ క‌మిటీని తొల‌గించ‌డంతో పాటు.. కొత్త సెలక్షన్ కమిటీ ఎంపిక కోసం దరఖాస్తులను బీసీసీఐ ఆహ్వానిచింది. బీసీసీఐ తాజా నిర్ణ‌యంతో చేత‌న్ శ‌ర్మ సారధ్యంలోని సీనియర్ జాతీయ సెలెక్టర్ల క‌మిటీ ఇటీవ‌లి కాలంలో తక్కువ స‌మ‌యం పనిచేన‌దిగా నిలిచింది. 

2020 ఫిబ్రవరిలో  సునీల్‌ జోషి (సౌత్ జోన్), హర్విందర్ సింగ్ (సెంట్రా జోన్) జాతీయ సెలెక్టర్లుగా నియమించారు. 2021 జనవరిలో ఏజీఎం తర్వాత మోహంతి, కురువిల్లాతో కలిసి చేతన్ సెలక్టర్ల ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. చేతన్ శ‌ర్మ‌ హయాంలో టీ20 వరల్డ్ క‌ప్ 2021 ఎడిషన్లో నాకౌట్ దశకు చేరుకోవడంలో విఫలమైన భారత్.. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఓడిపోయింది. ఈ సెల‌క్ష‌న్ క‌మిటీ తొల‌గింపున‌కు ప్ర‌ధాన కార‌ణం జ‌ట్టు కూర్పులో స‌రిగ్గా లేక‌పోవ‌డంతో పాటు ప‌దేప‌దే కెప్టెన్ల‌ను మార్పు నిర్ణ‌యం కూడా ఉంద‌ని క్రీడా విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios