కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే అనుష్క కనిపించదు.. భార్యలు, ప్రియురాళ్లు వద్దన్న బీసీసీఐ

BCCI to Restrict Team india Cricketers Wives and Girlfriends
Highlights

కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే అనుష్క శర్మ గ్యాలరీలో కనిపించడం.. కోహ్లీ బ్యాట్‌తోనే అనుష్కకు ఫ్లయింగ్ కిస్‌లు పెట్టడం ఇలాంటివి కొద్దిరోజుల పాటు గ్రౌండ్‌లో కనిపించవు

కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే అనుష్క శర్మ గ్యాలరీలో కనిపించడం.. కోహ్లీ బ్యాట్‌తోనే అనుష్కకు ఫ్లయింగ్ కిస్‌లు పెట్టడం ఇలాంటివి కొద్దిరోజుల పాటు గ్రౌండ్‌లో కనిపించవు. మ్యాచ్‌లు జరిగే ప్రతి చోటకి క్రికెటర్లు భార్యలను, ప్రియురాళ్లను వెంటేసుకు రావడం.. వారితో అర్థరాత్రి దాకా పార్టీలకు వెళ్లడం మ్యాచ్‌లో సరిగా ఆడకపోవడం ఆనవాయితీగా వస్తుంది.

తాజాగా ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో ఓటమి పాలవ్వడం.. టెస్టు సిరీస్ కఠినంగా ఉండే అవకాశాలు ఉండటంతో బీసీసీఐ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. దీనిలో భాగంగా క్రికెటర్లు తమ భార్యలు, ప్రియురాళ్లను దూరంగా ఉంచాలని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.

టెస్ట్ సిరీస్‌లోని తొలి మూడు టెస్టులకు భార్యలు, ప్రియురాళ్లను తీసుకురావద్దంటూ మేనేజ్‌మెంట్ చెప్పినట్లు సమాచారం. గతంలో భార్యలు, ప్రియురాళ్లు, స్నేహితులను వెంటేసుకుని పర్యటనలకు వెళ్లినప్పుడు మన ఆటగాళ్లు పేలవంగా ఆడిన సందర్భాలు కోకొల్లలు.

loader