Asianet News TeluguAsianet News Telugu

కోహ్లీ అభ్యర్థనకు ఓకే చెప్పిన బిసిసిఐ...కానీ పదిరోజుల తర్వాతే భార్యలు, గర్ల్‌ప్రెండ్స్

విదేశీ టూర్లలో క్రికెటర్ల వెంట వారి భార్యలు, గర్ల్ ప్రెండ్స్ కూడా వెళుతుండటం తెలిసిందే. వారు క్రికెటర్ల వెంటే ఉంటుంటారు. మ్యాచ్ ల సందర్భంగా స్టేడియంకు వచ్చి తమవారిని  ఉత్సాహపరుస్తుంటారు. అయితే ఇలా విదేశీ పర్యటనల్లో క్రికెటర్ల వెంట భార్యలు, ప్రియురాళ్లు కేవలం రెండు వారాలే ఉండటానికి బిసిసిఐ అనుమతిస్తుంది. దీంతో ఈ నిబంధన వల్ల క్రికెటర్లు నెలల తరబడి తమ కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తోందంటూ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యతిరేకత వ్యక్తం చేశాడు. వెంటనే ఈ నిబంధనను మార్చి సీరిస్ ఆసాంతం తమవారు  తమతోపాటే ఉండేలా నిబంధనలు మార్చాలంటూ బిసిసిఐకి విజ్ఞప్తి చేశాడు. 
 
bcci accepted team india captain virat kohli request
Author
New Delhi Railway Station, First Published Oct 17, 2018, 11:20 AM IST

విదేశీ టూర్లలో క్రికెటర్ల వెంట వారి భార్యలు, గర్ల్ ప్రెండ్స్ కూడా వెళుతుండటం తెలిసిందే. వారు క్రికెటర్ల వెంటే ఉంటుంటారు. మ్యాచ్ ల సందర్భంగా స్టేడియంకు వచ్చి తమవారిని  ఉత్సాహపరుస్తుంటారు. అయితే ఇలా విదేశీ పర్యటనల్లో క్రికెటర్ల వెంట భార్యలు, ప్రియురాళ్లు కేవలం రెండు వారాలే ఉండటానికి బిసిసిఐ అనుమతిస్తుంది. దీంతో ఈ నిబంధన వల్ల క్రికెటర్లు నెలల తరబడి తమ కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తోందంటూ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యతిరేకత వ్యక్తం చేశాడు. వెంటనే ఈ నిబంధనను మార్చి సీరిస్ ఆసాంతం తమవారు  తమతోపాటే ఉండేలా నిబంధనలు మార్చాలంటూ బిసిసిఐకి విజ్ఞప్తి చేశాడు. 

కోహ్లీ వినతిపై బిసిసిఐ వ్యవహారాలను చూసుకుంటున్న వినోద్ రాయ్ నేతృత్వంలోని పాలక మండలి(సీఓఏ) సానుకూల నిర్ణయం తీసుకుంది. విదేశీ పర్యటన ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు క్రికెటర్ల వెంట వారి భార్యలు, ప్రియురాళ్లు ఉండటానికి అనుమతించింది. అయితే విదేశీ పర్యటన మొదలైన పదిరోజుల తర్వాత వారు క్రికెటర్ల వద్దకు వెళ్లి పర్యటన ముగిసే వరకు వారితోనే ఉండొచ్చని షరతు విధించింది.

అయితే ఇదివరకు భార్యలు, ప్రియురాళ్లు క్రికెటర్ల వెంట ఉండటంతో వారు ఆటపై దృష్టి పెట్టలేక పోతున్నారని ఈ రెండు వారాల నిబంధనను బిసిసిఐ తీసుకువచ్చింది. క్రికెటర్ల ఏకాగ్రత మొత్తం కేవలం ఆటపైనే ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కెప్టెన్ కోహ్లీ విదేశీ పర్యటనల్లో నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉండటంతో డిప్రెషన్ కు లోనవుతున్నట్లు తెలిపాడు. అందువల్లే టూర్ మొత్తం భార్యలకు అనుమతివ్వాలని బిసిసిఐ ని కోరినట్లు కోహ్లీ వివరించారు.  

సంబంధిత వార్తలు

మా భార్యలతో కేవలం రెండువారాలేనా...: కోహ్లీ
 
Follow Us:
Download App:
  • android
  • ios