విరాట్ కోహ్లీకి బ్యాడ్ న్యూస్: వారందరికి కూడా..

Bad News For Indian Players
Highlights

టీమిండియా క్రికెటర్లపై టీం యాజమాన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

లండన్: టీమిండియా క్రికెటర్లపై టీం యాజమాన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఆతిధ్య దేశంతో టీ-20, వన్డే సిరీస్‌లను ముగించుకొని టెస్ట్ సిరీస్ కు సిద్దమవుతోంది.టెస్ట్ సిరీస్‌కి ఇంకా సమయం ఉండటంతో దొరికిన ఖాళీ సమయంలో తమ భార్యలతో భారత ఆటగాళ్లు షికార్లు చేస్తున్నారు

 తాము అక్కడ దిగిన ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు టీం ఇండియా క్రికెటర్లు తమ భార్యలకు, గర్ల్ ఫ్రెండ్స్ కు దూరం కావాల్సిన పరిస్థితి వచ్చేసింది. టెస్ట్ సిరీస్ ఇంకా వారం రోజులే సమయం ఉండటంతో ఇక క్రికెట్ ప్రాక్టీస్ ప్రారంభించాలని బీసీసీఐ యాజమాన్యం ఆదేశించినట్లు తెలుస్తోంది.
 
ఒక ముఖ్యమైన సిరీస్‌కి ముందు జట్టు సభ్యులు విశ్రాంతి తీసుకొనేందుకు నాలుగు రోజుల సమయం ఇచ్చామని, ఒక ప్లేయర్లు వాళ్ల భార్యలు, ఫ్రెండ్స్, చుట్టాలను వెనక్కి పంపించాల్సిన సమయం వచ్చిందని, సోమవారం జట్టు మొత్తం ఛెమ్స్‌ఫర్డ్‌కి బయలుదేరుతున్నామని ఓ అధికారి చెప్పారు. మూడో టెస్టు ముగిసే వరకు భార్యలకు, గర్ల్ ఫ్రెండ్స్ కు దూరంగా ఉండాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. 

గతంలో చాలా సందర్భాల్లో క్రీడాకారుల ఆటతీరు బాగాలేనప్పుడు వాళ్ల కుటుంబ సభ్యులు విమర్శలు ఎదురుకున్న విషయాన్ని యాజమాన్యం గుర్తు చేసింది. అయితే ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్ ఎంతో ముఖ్యమైందని, అందువల్లఆటగాళ్లు తమ భార్యలకు, గర్ల్‌ఫ్రెండ్స్‌కి దూరంగా ఉంటే ఫలితం భారత్‌కు అనుకూలంగా వస్తుందని అంటున్నారు.
 
లండన్‌లో ఉన్న ఆటగాళ్ల భార్యలు లేదా గర్ల్‌ఫ్రెండ్లకు ప్రత్యేకమైన మేనేజర్‌ని నియమించాలని కూడా బీసీసీఐ తెలిపింది. కానీ సీఓఏ ఇందుకు నిరాకరించింది. ఆగస్టు 1వ తేదీన బర్మింహామ్ వేదికగా ఇంగ్లండ్‌, భారత్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. 

loader