Asianet News TeluguAsianet News Telugu

జడేజా వల్లనే గెలిచాం: అజారుద్దీన్ కితాబు

రవీంద్ర జడేజాను జట్టు నుంచి తీసేయకూడదని, ఆసియాకప్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌తో అద్భుతంగా రాణించాడని, ఫైనల్‌ మ్యాచ్‌లో జడేజా త్వరగా అవుటై ఉంటే భారత్‌ మ్యాచే నెగ్గేది కాదని అజార్ అన్నాడు.

Azaharudding praises Ravindra Jadeja
Author
New Delhi, First Published Sep 29, 2018, 5:35 PM IST

న్యూఢిల్లీ: ఆసియా కప్ విజయం ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వల్లనే సాధ్యమైందని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. జడేజాను జట్టులో కొనసాగించాలని ఆయన అభిప్రాయపడ్డారు.  భారత విజయంలో జడేజా కీలక పాత్ర పోషించాడని ఆయన ప్రశంసించాడు. 

అతి క్లిష్టమైన దశలో జడేజా(23;33 బంతుల్లో) భువనేశ్వర్‌ (21;31 బంతుల్లో)తో కలిసి ఏడో వికెట్‌కు 45 పరుగులు జోడించాడు. ఈ టోర్నీలో అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తో రాణించిన జడేజాను జట్టులో కొనసాగించాలని ఆయన ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు.

రవీంద్ర జడేజాను జట్టు నుంచి తీసేయకూడదని, ఆసియాకప్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌తో అద్భుతంగా రాణించాడని, ఫైనల్‌ మ్యాచ్‌లో జడేజా త్వరగా అవుటై ఉంటే భారత్‌ మ్యాచే నెగ్గేది కాదని అజార్ అన్నాడు. జడేజా భారత జట్టు 11 మంది సభ్యుల్లో ఎప్పుడు ఒకడేనని తెలిపాడు. 

గాయపడి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన కేదార్ జాదవ్ చివరలో బ్యాటింగ్  చేయడాన్ని కూడా ఆయన ప్రశంసించారు. రోహిత్‌ శర్మ కెప్టెన్సీని కొనియాడారు. రోహిత్ చాలా కూల్‌గా, ఏమాత్రం భయంలేకుండా కనిపించాడని అన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios