Asianet News TeluguAsianet News Telugu

అడిలైడ్ టెస్ట్‌: కంగారెత్తించి టీమిండియా విజయం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ చెమటోడ్చి విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 323 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 291 పరుగులకు అలౌటైంది. దీంతో భారత్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

Australia vs India first test updates
Author
Adelaide SA, First Published Dec 10, 2018, 6:59 AM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ చెమటోడ్చి విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 323 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 291 పరుగులకు అలౌటైంది. దీంతో భారత్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.

నాలుగు వికెట్లకు 104 పరుగులతో ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌కు ట్రావిస్ హెడ్, షాన్ మార్ష్ జంట మంచి ఆరంభాన్నిచ్చింది వీరిద్దరూ కుదురుకుంటున్న దశలో ట్రేవిస్ ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు..

ఆ తర్వాత కెప్టెన్ పైన్ సాయంతో షాన్ మార్ష్‌లు నిలకడగా ఆడారు.. ఆరో వికెట్‌కు 41 పరుగులు జోడించిన తర్వాత మార్ష్‌ను బుమ్రా పెవిలియన్‌కు చేర్చాడు. అనంతరం కమిన్స్-పైన్‌లు వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు.

ఆచితూచి ఆడుతూ స్కోరును కదిలించారు. ఈ క్రమంలో పైన్ అవుటయ్యాడు. అయినా పట్టుదలగా ఆడిన కమిన్స్ వరుసగా వికెట్లు పడుతున్నా, టెయిలెండర్ల సాయంతో  భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు.

20 ఓవర్లను ఎదుర్కొని ఆసీస్‌కు విజయంపై ఆశలు కల్పించి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత నాథన్ లయాన్-హేజల్ వుడ్ జోడీ కాసేపు భారత శిబిరాన్ని ఆందోళనకు గురిచేసింది.. చివర్లో అశ్విన్ బౌలింగ్ వుడ్ పెవిలియన్‌కు చేరడంతో 291 పరుగుల వద్ద ఆసీస్ కథ ముగిసింది.  

సంబంధిత వార్తలు

అడిలైడ్ టెస్ట్: పోరాడుతున్న ఆస్ట్రేలియా, ఆరు వికెట్ల దూరంలో భారత్

Follow Us:
Download App:
  • android
  • ios