Asianet News TeluguAsianet News Telugu

వన్డేల్లో మరో డబుల్ సెంచరీ నమోదు...సిక్సర్లలోనూ రికార్డే

వన్డే క్రికెట్ లో మరో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియాకు చెందిన లిస్ట్ ఎ క్రికెటర్ ఆర్కీ షార్ట్ సరికొత్త రికార్డు నమోదుచేశాడు.వన్డే మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేయడమే  కాకుండా   అత్యధిక సిక్సర్లు బాది మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా విద్వంసకర బ్యాటింగ్ తో రెచ్చిపోయి  వెస్టర్న్ ఆస్ట్రేలియాకు ఒంటిచేత్తో విజయం అందించారు. 
 

Australia's Short goes big with record double century
Author
Australia, First Published Sep 28, 2018, 7:49 PM IST

వన్డే క్రికెట్ లో మరో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియాకు చెందిన లిస్ట్ ఎ క్రికెటర్ ఆర్కీ షార్ట్ సరికొత్త రికార్డు నమోదుచేశాడు.వన్డే మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేయడమే  కాకుండా   అత్యధిక సిక్సర్లు బాది మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా విద్వంసకర బ్యాటింగ్ తో రెచ్చిపోయి  వెస్టర్న్ ఆస్ట్రేలియాకు ఒంటిచేత్తో విజయం అందించాడు.

వెస్టర్న్‌ ఆస్ట్రేలియా, క్విన్స్‌లాండ్‌ మధ్య జరిగిన దేశవాళి వన్డే మ్యాచ్‌లో షార్ట్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో భాగంగా బ్యాంటింగ్ కు దిగిన షార్ట్ మొదట నెమ్మదిగాను బ్యాటింగ్ ఆరంభించాడు. ఇతడు సెంచరీ చేయడానికి 83 బంతులు ఆడాడు. అయితే సెంచరీ తర్వాత తన విశ్వరూపం చూపించాడు. కేవలం 45 బంతుల్లోనే మరో వంద పరుగులు జోడించి డబుల్ సెంచరీ చేశాడు.  మొత్తం 148 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మన్ 23 సిక్సర్లు, 15 ఫోర్ల సాయంతో ఏకంగా 257 పరుగులు చేశాడు. డబుల్ సెంచరీ సాధించడమే రికార్డనుకుంటే...ఒకే ఇన్నింగ్స్ లో 23 సిక్సర్లు బాది మరో రికార్డును కూడా తన షార్ట్ ఖాతాలో వేసుకున్నాడు.

ఇతడి విద్వంసకర ఆటతో వెస్ట్రన్ ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 387 పరుగులు చేసింది. 388 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన  క్వీన్స్‌ల్యాండ్ 271 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో వెస్టర్న్‌ ఆస్ట్రేలియా 106 పరుగుల తేడాతో క్విన్స్‌లాండ్‌పై విజయం సాధించింది.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios