Asianet News TeluguAsianet News Telugu

వరల్డ్ కప్‌లో రిషబ్ పంత్‌తో ఓపెనింగ్ చేయించాలి...ఎందుకంటే: షేన్ వార్న్

మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ప్రపంచ కప్ 2019 విజేతగా నిలిచే అన్ని అర్హతలు టీంఇండియాకు వున్నాయని ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ షేన్ వార్న్ కితాబిచ్చాడు.  అయితే అందుకోసం భారత జట్టు కొన్ని ప్రయోగాలు చేయాలని ఆయన సూచించారు. తన సూచనలను పాటిస్తే ఈ మెగా టోర్నీలో భారత్ కు ఎదురుండదని ఈ ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం వెల్లడించాడు. 
 
australia farmer cricketer Shane Warne wants Rishabh Pant to open innings with Rohit Sharma
Author
Hyderabad, First Published Feb 13, 2019, 5:47 PM IST

మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ప్రపంచ కప్ 2019 విజేతగా నిలిచే అన్ని అర్హతలు టీంఇండియాకు వున్నాయని ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ షేన్ వార్న్ కితాబిచ్చాడు.  అయితే అందుకోసం భారత జట్టు కొన్ని ప్రయోగాలు చేయాలని ఆయన సూచించారు. తన సూచనలను పాటిస్తే ఈ మెగా టోర్నీలో భారత్ కు ఎదురుండదని ఈ ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం వెల్లడించాడు. 

భారత్ రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా కొన్ని మార్పులతో ఆటగాళ్లను బరిలోకి దించాలని వార్న్ అన్నారు. ముఖ్యంగా ఓపెనింగ్ జోడీ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఇప్పుడున్న ఓపెన్లు రోహిత్ శర్మ- శిఖర్ ధావన్ లో అత్యుత్తమంగా ఆడుతున్నారని ప్రశంసిస్తూనే... ప్రపంచ  కప్ టోర్నీలో మాత్రం రోహిత్ కు తోడుగా యువ ఆటగాడు రిషబ్ పంత్ ను ఓపెనర్ గా బరిలోకి దించాలని వార్న్ సూచించారు. 

ఈ ప్రయోగం ద్వారా ప్రత్యర్థి జట్లు రోహిత్- శిఖర్ జోడీని విడగొట్టడానికి ముందుగానే సిద్దం చేసుకున్న వ్యూహాలు పనిరాకుండా పోతాయన్నారు. ఇలా ప్రత్యర్థులను అయోమయానికి గురిచేస్తూ వారు తేరుకునే లోపే విజయ తీరాలను చేరవచ్చని వార్న్ అభిప్రాయపడ్డారు. 

ఓపెనర్లను నేరుగా ప్రపంచ కప్ లో కాకుండా అంతకుముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్ లో బరిలోకి దించాలన్నారు. దీని వల్ల ఓపెనర్లిద్దరి మధ్య సమన్వయం కుదరడంతో పాటు జట్టుకు విశ్వాసం ఏర్పడుతుందన్నారు. 

భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రస్తుతం బాగా రాణిస్తున్నాడని...భవిష్యత్‌లొ అతడు మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకుంటాడని వార్న్ జోస్యం చెప్పారు. ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టులో ధోనితో పాటు రిషబ్ ను కూడా ఎంపిక చేయాలని సూచించారు. అతన్ని ఓ వికెట్ కీపర్ గా కాకుండా ఓ బ్యాట్ మెన్ గా మాత్రమే పరిగణించి అవకాశం కల్పించాలని వార్న్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.   

Follow Us:
Download App:
  • android
  • ios