తీవ్ర మానసిక ఒత్తిడి వల్లే యాషెస్ సిరీస్ లో అక్రమాలకు పాల్పడినట్లు ఆసిస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపారు. ఇలా అక్రమమార్గంలో గెలుపు పొంది ఒత్తిడిని దూరం చేసుకోవాలని భావించామని, అందువల్లే బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. ఈ అర్థం లేని నిర్ణయాల వల్ల తనకు ఇష్టమైన క్రికెట్ కి దూరంగా ఉండాల్సి వస్తోందంటూ ఆవేధన వ్యక్తం చేశారు. 

ఇక బాల్ ట్యాంపరింగ్ వ్యవహరంలో ఏడాది నిషేదానికి గురైన స్మిత్ కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కాస్త ఊరటనిచ్చింది. దీంతో అతడు కెనడాలో జరుగుతున్న గ్లోబల్ టీ20 లీగ్ లో ఘనంగా పునరాగమనం చేశారు. ఈ టోర్నీలో టొరంటో నేషన్స్ తరపున బరిలోకి దిగిన స్మిత్ 41 బంతుల్లో 8 పోర్లు, ఒక సిక్సర్ సాయంతో 61 పరుగులతో రాణించాడు.  ఈ మ్యాచ్ అనంతరం స్మిత్ మీడియాతో మాట్లాడుతూ బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంపై మాట్లాడారు.

ఆసీస్ కెప్టెన్ గా తాను కొన్ని దారుణమైన నిర్ణయాలు తీసుకున్నట్లు స్మిత్ తెలిపారు. ఈ నిర్ణయాలు తప్పిన తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో, మానసిక ఒత్తిడిని తగ్గించుకోడానికి చేయాల్సి వచ్చిందని అన్నారు. నిషేద సమయం అయిపోయిన తర్వాత జట్టులో చేరి మునుపటి ఫార్మ్ తో జట్టుకు సేవలందిచాలని కోరుకుంటున్నట్లు స్మిత్ తెలిపాడు.