ఆస్ట్రేలియా కూడా ...

ఫిఫా వరల్డ్ కప్ నుండి తాను నిష్క్రమిస్తూ తన వెంట మరో జట్టును కూడా తీసుకెళ్లింది పేరూ టీం. రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ పుట్ బాల్ లో నిన్న గ్రూప్-సి నుండి ఆస్ట్రేలియా, పెరూ దేశాలు ఢీకొన్నాయి. ఇప్పటికే ఓటములతో సతమతమవుతూ టోర్నీ నుండి అవుటైన పెరూ తన చివరి మ్యాచ్ లో గెలిచి ఆస్ట్రేలియా ఆశలపై కూడా నీళ్లు చల్లింది.

నిన్న మంగళవారం జరిగిన గ్రూప్‌-సి మ్యాచ్‌లో పెరూ 2-0తో ఆస్ట్రేలియాను ఓడించి ఓదార్పు విజయాన్ని అందుకుంది. ఆండ్రే కరిల్లో (18వ నిమిషం), కెప్టెన్‌ పాలో గుర్రెరో (50వ) గోల్స్‌ చేసి పెరూకు విజయాన్ని అందించారు. ఇక 

మ్యాచ్‌ మొదలైన రెండో నిమిషంలోనే ఆసీస్‌ కెప్టెన్‌ మిలే జెడినాక్‌ను గుర్రెరో అభ్యంతరకరంగా అడ్డుకోవడంతో ఫ్రీకిక్‌ లభించింది. కానీ జెడినాక్‌ దానిని గోల్‌గా మలచలేకపోయాడు. అయితే ఆ తర్వాత పెరూ తమదైన శైలిలో ఆడుతూ పూర్తి ఆధిపత్యాన్ని కనబర్చింది. ఈ మ్యాచ్ ను గెలిచిన పెరూ వరల్డ్‌కప్‌ విక్టరీతో వీడ్కోలు పలికింది. 

అయితే ఆస్ట్రేలియా జట్టు కూడా పెరూ చేతిలో 2-0 తో ఓటమికి గురై వరల్డ్ కప్ నుండి నిష్క్రమించింది.

"