పారా ఆసియా గేమ్స్‌లో భారత్ జోరు.. దీప్తి జీవన్‌జీకి స్వర్ణం..
చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న పారా ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల జోరు కొనసాగుతుంది.
చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న పారా ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల జోరు కొనసాగుతుంది. తొలి రోజు భారత అథ్లెట్స్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం కూడా భారత అథ్లెట్స్ అదే జోరు కొనసాగిస్తున్నారు. రెండో రోజు ప్రాచీ యాదవ్, క్వార్టర్‌మిలర్ దీప్తి జీవన్‌జీ స్వర్ణం సాధించారు. మహిళల టీ20 400 మీటర్ల పోటీలో దీప్తి జీవన్‌జీ బంగారు పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. దీప్తి 56.69 సెకన్లలో ఈ విజయాన్ని నమోదు చేశారు. ఇక,
సోమవారం కానో వీఎల్2 విభాగంలో రజతం గెలిచిన ప్రాచీ, కేఎల్2 ఈవెంట్‌లో స్వర్ణం కైవసం చేసుకోవడంతో గేమ్స్‌లో తన రెండవ పతకాన్ని సొంతం చేసుకున్నారు.
ఇక, 2018 ఇండోనేషియాలో జరిగిన పారా ఆసియా గేమ్స్‌లో 15 స్వర్ణాలు, 24 రజతాలు, 33 కాంస్య పతకాలతో సహా 72 పతకాల రికార్డును.. ఈ సారి అధిగమించాలని భారతదేశం భావిస్తోంది. ఈ క్రమంలోనే హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్‌లో 17 క్రీడలలో పాల్గొంటున్న భారతదేశం 303 మంది క్రీడాకారుల బృందాన్ని పంపింది.