చైనాలోని హౌంగ్‌జౌలో జరుగుతున్న పారా ఆసియా గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. 

చైనాలోని హౌంగ్‌జౌలో జరుగుతున్న పారా ఆసియా గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. భారత అథ్లెట్ అంకుర్ థామా.. పురుషుల 5000 మీటర్ల టీ 11లో విజేతగా నిలిచి స్వర్ణం సొంతం చేసుకున్నారు. ఈవెంట్‌లో అంకుర్ తన గైడ్ రన్నర్‌తో రేసును 16:37.29లో ముగించి.. స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తాజా స్వర్ణంతో పారా ఆసియా గేమ్స్‌లో భారత్ ఇప్పటివరకు సాధించిన గోల్డ్ మెడల్స్ సంఖ్య ఐదుకు చేరింది. అలాగే భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 13కు చేరింది. 

పురుషుల హైజంప్ టీ47 ఫైనల్‌లో నిషాద్ కుమార్, పురుషుల హైజంప్ టీ63 ఈవెంట్‌లో శైలేష్ కుమార్, బ్ త్రో ఎఫ్51 ఈవెంట్‌లో ప్రణవ్ సూర్మ, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్‌1లో అవని లేఖరా స్వర్ణాలు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక, 2018 ఇండోనేషియాలో జరిగిన పారా ఆసియా గేమ్స్‌లో 15 స్వర్ణాలు, 24 రజతాలు, 33 కాంస్య పతకాలతో సహా 72 పతకాల రికార్డును.. ఈ సారి అధిగమించాలని భారతదేశం భావిస్తోంది. 

Scroll to load tweet…