Asianet News TeluguAsianet News Telugu

ఏషియన్ గేమ్స్ 2023: చరిత్ర సృష్టించిన రాంకీరెడ్డి- చిరాగ్ శెట్టి.. ఫైనల్‌‌లోకి భారత బ్యాడ్మింటన్ జోడి...

మలేషియా జోడితో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 21-17, 21-12 తేడాతో విజయం అందుకున్న సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి- చిరాగ్ శెట్టి జోడి... ఏషియన్ గేమ్స్‌లో ఫైనల్ చేరిన మొట్టమొదటి భారత డబుల్స్ జోడిగా రికార్డు.. 

Asian Games 2023: Satwiksairaj Rankireddy- Chirag Shetty creates history, enters into finals CRA
Author
First Published Oct 6, 2023, 7:23 PM IST

ఏషియన్ గేమ్స్ 2023 టోర్నీలో భారత్‌కి అక్టోబర్ 6 బాగా కలిసి వచ్చింది. భారత పురుషుల హాకీ జట్టు స్వర్ణం గెలవగా భారత కబడ్డీ పురుషుల జట్టు, మహిళా కబడ్డీ జట్టు కూడా ఫైనల్‌కి ప్రవేశించాయి. తాజాగా బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌లోనూ భారత బ్యాడ్మింటన్ టాప్ సీడ్ సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి- చిరాగ్ శెట్టి జోడి ఫైనల్ చేరింది. 

సెమీస్‌లో మలేషియా జోడి ఆరోన్ చియా- సో వూ యిక్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-17, 21-12 తేడాతో వరుస సెట్లలో ఈజీ విక్టరీ అందుకుంది భారత జోడి సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి- చిరాగ్ శెట్టి. మొదటి సెట్‌లో 9-9 తేడాతో రెండు జోడీలు సమంగా నిలిచాయి. అయితే ఆ తర్వాత వరుస పాయింట్లతో భారత జట్టు 17-11 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఎలాంటి హైడ్రామా లేకుండా 21-17 తేడాతో సెట్‌ని సొంతం చేసుకుంది భారత్.

రెండో సెట్‌లో భారత్ పూర్తిగా డామినేషన్ చూపించింది. 11-3 తేడాతో తిరుగులేని ఆధిక్యంలో నిలిచిన సాత్విక్‌సాయిరాజ్- చిరాగ్ శెట్టి.... దాన్ని కాపాడుకుంటూ రెండో సెట్‌ని, మ్యాచ్‌ని సొంతం చేసుకున్నారు.

ఏషియన్ గేమ్స్ చరిత్రలో ఫైనల్‌ చేరిన మొట్టమొదటి  భారత బ్యాడ్మింటన్ జోడిగా చరిత్ర సృష్టించారు సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి. 

Follow Us:
Download App:
  • android
  • ios