ఏషియన్ గేమ్స్ 2023: గురి తప్పని బాణం.. ఆర్చరీలో జ్యోతి సురేఖకు మరో స్వర్ణం..
ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత్‌కి పతకాల వేట కొనసాగుతుంది. ముఖ్యమంగా భారత ఆర్చర్లు అదరగొడుతున్నారు.
ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత్‌కి పతకాల వేట కొనసాగుతుంది. ముఖ్యమంగా భారత ఆర్చర్లు అదరగొడుతున్నారు. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ వెన్నం స్వర్ణం సాధించింది. గురితప్పకుండా స్వర్ణాన్ని ముద్దాడారు. సౌత్ కొరియాకు చెందిన సో చైవాన్‌తో జరిగిన ఫైనల్‌లో 159-158 పాయింట్ల తేడాతో విజయం సాధించి.. ఈ స్వర్ణం కైవసం చేసుకుంది. ఇక, ఈ ఏడాది ఏషియన్ గేమ్స్‌లో జ్యోతి సురేఖకు ఇది మూడో స్వర్ణం. ఇప్పటికే మిక్స్‌డ్ పెయిర్, మహిళల టీమ్ ఈవెంట్‌లలో ఇప్పటికే జ్యోతి స్వర్ణాలు సాధించిన సంగతి తెలిసిందే.
దీంతో ఈ ఏడాది ఏషియన్ గేమ్స్‌లో అత్యంత విజయవంతమైన భారత క్రీడాకారిణిగా జ్యోతి సురేఖ నిలిచారు. అయితే ఈ అద్భుత ప్రదర్శనపై జ్యోతి స్పందిస్తూ.. ‘‘నాకు మాటలు లేవు. చాలా భావోద్వేగానికి గురవుతున్నారు. దీని గురించి ఆలోచించడానికి నాకు కొంత సమయం కావాలి’’ అని చెప్పారు. ఇక, ఆర్చరీలో భారత్ పతకాల సంఖ్య కూడా 24కు చేరింది.
ఇదిలాఉంటే, ఏషియన్ గేమ్స్ 2023లో శనివారం (14వ రోజు) భారత్ పతకాల సంఖ్య 100కి చేరుకుంది. ఇక, ఆర్చరీలో అభిషేక్ వర్మ రజతం, అదితి గోపీచంద్ కాంస్యం సాధించారు. మహిళల కబడ్డీ జట్టు ఫైనల్లో చైనీస్ తైపీని ఓడించి స్వర్ణం సాధించింది.