ఏషియన్ గేమ్స్ 2023: పాకిస్తాన్‌ని చిత్తు చేసి, ఫైనల్ చేరిన భారత కబడ్డీ జట్టు... మహిళా కబడ్డీ టీమ్ కూడా

పాకిస్తాన్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 61-14 తేడాతో ఘన విజయం అందుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టు... నేపాల్‌ని ఓడించి ఫైనల్ చేరిన మహిళా కబడ్డీ జట్టు.. 

Asian Games 2023: Indian kabaddi teams reaches Finals,  HS Prannoy wins Bronze medal CRA

ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత్ అదరగొడుతోంది.  భారత పురుషుల కబడ్డీ జట్టు వరుస విజయాలతో ఫైనల్ చేరింది. పాకిస్తాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 61-14 తేడాతో ఘన విజయం అందుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టు, ఫైనల్‌కి ప్రవేశించింది..

మహిళా కబడ్డీ జట్టు కూడా ఫైనల్‌కి ప్రవేశించింది. నేపాల్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 61-17 తేడాతో ఘన విజయం అందుకుని ఫైనల్ చేరింది భారత మహిళా కబడ్డీ జట్టు. చైనీస్ తైపాయ్‌తో రేపు 7 గంటలకు ఫైనల్ మ్యాచ్ ఆడనుంది భారత మహిళా కబడ్డీ జట్టు.. 

ఉమెన్ రేగు సెపక్టక్రా పోటీల్లో సెమీస్ చేరిన భారత జట్టు, కాంస్య పతకం గెలిచింది. సెమీ ఫైనల్‌లో థాయిలాండ్ చేతుల్లో 0-2 తేడాతో ఓడింది. భారత పురుషుల ఆర్చరీ రీకర్వ్ టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు ఫైనల్ చేరింది. అథాను దాస్, బీరాజ్, తుషార్ 5-3 తేడాతో బంగ్లాదేశ్‌ని ఓడించారు.. భారత జట్టు, సౌత్ కొరియాతో రేపు ఫైనల్‌లో తలబడనుంది. 

బ్యాడ్మింటన్ పురుషుల వ్యక్తిగత విభాగంలో సెమీ ఫైనల్ చేరిన హెచ్‌.ఎస్ ప్రణయ్, ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్, చైనా బ్యాడ్మింటన్ ప్లేయర్ లి షిఫెండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 15-21, 9-21 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయాడు. అయితే సెమీస్ చేరిన ప్రణయ్‌కి కాంస్య పతకం దక్కింది..

రెజ్లింగ్‌లో భారత్‌కి ఆశించిన ఫలితం రాలేదు. భజరంగ్ పూనియా, ఆమన్ సెహ్రావత్, సోనమ్, కిరణ్ సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయారు. అయితే ఈ నలుగురు కాంస్య పతకం కోసం పోరాడబోతున్నారు. 

ఆర్చరీలో మహిళల రీకర్వ్ టీమ్ ఈవెంట్‌లో అంకితా భకత్, భజన్ కౌర్, సిమ్రాన్‌జీత్ కౌర్, వియాత్నంతో జరిగిన మ్యాచ్‌లో 6-2 తేడాతో గెలిచి కాంస్యం గెలిచారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios