ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 2023: భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన, మూడు స్వర్ణాలు

ఆసియా అథ్లెటిక్స్  చాంపియన్ షిప్ లో  భారత క్రీడాకారులు  అద్భుతమైన ప్రదర్శనను కనబర్చారు.  రెండు రోజుల్లో  మూడు బంగారు పతకాలు, మూడు కాంస్యాలతో  ఇండియా మూడో స్థానంలో నిలిచింది. 

Asian Athletics Championships 2023 : Jyothi Yarraji, Abdulla Aboobacker, Ajay Kumar win gold lns

న్యూఢిల్లీ: థాయ్ లాండ్ లో జరుగుతున్న  25వ ఆసియాఅథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 2023 లో భారత్ క్రీడాకారులు రెండో రోజైన గురువారంనాడు అద్భుతమైన ప్రదర్శనను కనబర్చారు.  రెండు రోజుల్లో భారత్ క్రీడాకారులు   మూడు స్వర్ణాలు, మూడు కాంస్యాలను సాధించారు.  ఈ నెల  12న  ప్రారంభమైన క్రీడలుఈ నెల  16వ తేదీతో ముగియనున్నాయి.

ఈ క్రీడల్లో  మహిళల 100 మీటర్ల హర్డిల్స్ లో  జ్యోతియరాజాజీ  బంగారు పతకం సాధించింది.  పురుషుల  1500 మీట్ల రేసులో అజయ్ కుమార్ సరోజ్  కూడ స్వర్ణ పతకాన్ని  చేజిక్కించుకున్నాడు. పురుషుల  ట్రిపుల్ జంప్ లో  అబ్దుల్లా అబూబకర్ స్వర్ణం సాధించాడు.  వెయ్యి మీటర్ల రేసులో  అభిషేక్ పాల్  కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. మహిళల 400 మీటర్ల  రేసులో ఐశ్వర్య కైలాష్ మిశ్రా కాంస్యాన్ని సాధించింది.  పురుషుల డెకాథ్లాన్ లో  తేజస్విన్ శంకర్ కాంస్యం దక్కించుకున్నాడు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios