ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్  కొడుకు అర్జున్ టెండూల్కర్ దేశం తరపున తొలి వికెట్ తీశాడు.

ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ దేశం తరపున తొలి వికెట్ తీశాడు. శ్రీలంక్ పర్యటన కోసం బీసీసీఐ ప్రకటించిన అండర్-19 జట్టులో అర్జున్ చోటు దక్కించుకున్నాడు. కొలంబో వేదికగా ఇవాళ జరిగిన తొలి టెస్ట్‌‌లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ చేసింది..

మిషారా-ఫెర్నాండో లంక ఇన్నింగ్స్‌ను ఆరంభించారు.. ఈ క్రమంలో బౌలింగ్ దిగిన అర్జున్ టెండూల్కర్ పొదుపుగా బౌలింగ్ చేశాడు.. రెండో ఓవర్‌ చివరి బంతికి మిషారాని ఎల్బీడబ్ల్యూగా పంపాడు.. ఇది భారత్ తరపున అర్జున్‌కి తొలి వికెట్. ఈ విషయం తెలుసుకున్న సచిన్ అభిమానులు, సన్నిహితులు అర్జున్‌కు అభినందనలు తెలుపుతున్నారు..