కోహ్లీకి ఐ లవ్ యూ చెప్పిన యువతితో అర్జున్ టెండూల్కర్

arjun tendulkar lunch with england women cricketer
Highlights

ఇంగ్లాండ్ టూర్‌లో సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ జాలీగా గడుపుతున్నారు. శ్రీలంకతో అండర్-19 యూట్ టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్‌కు చేరుకున్న అర్జున్... జట్టులో చోటు దక్కకపోవడంతో టూర్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు

ఇంగ్లాండ్ టూర్‌లో సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ జాలీగా గడుపుతున్నారు. శ్రీలంకతో అండర్-19 యూట్ టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్‌కు చేరుకున్న అర్జున్... జట్టులో చోటు దక్కకపోవడంతో టూర్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.. ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్‌తో కలిసి చక్కర్లు కొడుతున్నాడు.

లండన్‌లోని టూరిస్ట్ స్పాట్‌లను చుట్టేయడంతో పాటు వ్యాట్‌తో కలిసి లంచ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను డేనియల్ వ్యాట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కాగా, 2014లో విరాట్ కోహ్లీకి ప్రపోజ్ చేసిన వ్యాట్.. తనను పెళ్ళి చేసుకోవాలని ట్వీట్ చేయడం అప్పట్లో సంచలనం కలిగించింది.
 

loader