Asianet News TeluguAsianet News Telugu

దిగివచ్చిన ఏపీ ప్రభుత్వం...దీక్ష విరమించిన జ్యోతి సురేఖ

డబ్బులు ఇవ్వకుంటే దీక్ష చేస్తానన్న సురేఖ

arjun award winner jyothi surekha take step back on hunger strike

ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం దిగివచ్చింది. జ్యోతి సురేఖకు ఇస్తామని చెప్పిన ప్రొత్సాహకాలన్ని ఇవ్వడానికి అంగీకరించింది. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది. దీంతో.. జ్యోతి సురేఖ తాను చెప్పట్టిన నిరాహార దీక్షను  విరమించుకున్నారు.

అసలు విషయం ఏమిటంటే... అర్జున అవార్డు గ్రహీత, విలువిద్య క్రీడాకారిణి జ్యోతి సురేఖ కి ప్రభుత్వం ప్రోత్సాహకాల పేరిట రూ.కోటి ఇవ్వాల్సి ఉంది. 9 నెలలు గడుస్తున్నా.. ఇవ్వకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ నేపథ్యంలో ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష కూడా చేపట్టారు. విషయం తెలుసుకున్న  టీడీపీ నేత ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌, సాఫ్‌ చైర్మన్‌ అంకయ్య చౌదరిలు జ్యోతి సురేఖతో చర్చలు జరిపారు.

చివరకు ప్రభుత్వం  సురేఖ విషయంలో వెనక్కి తగ్గింది. ఆమెకు డబ్బులు ఇచ్చేందుకు జీవీ విడుదల చేసింది. దీంతో.. ఆమె దీక్ష విరమించారు.

Follow Us:
Download App:
  • android
  • ios