ఇది తెలుసా: అనిల్ కుంబ్లే భార్య తెలుగు అమ్మాయి

Anil Kumble says his wife is from Telugu states
Highlights

మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేకు సంబంధించి ఈ విషయం బహుశా ఎవరికీ తెలియకపోయి ఉండవచ్చు. ఆయన భార్య తెలుగమ్మాయి. ఈ విషయాన్ని అనిల్ కుంబ్లే స్వయంగా చెప్పాడు. 

అమరావతి: మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేకు సంబంధించి ఈ విషయం బహుశా ఎవరికీ తెలియకపోయి ఉండవచ్చు. ఆయన భార్య తెలుగమ్మాయి. ఈ విషయాన్ని అనిల్ కుంబ్లే స్వయంగా చెప్పాడు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గాండీవ ప్రాజెక్టులో ఆయన భాగస్వామిగా ఉన్నాడు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.

సుదీర్ఘ చరిత్ర ఉన్న మచిలీపట్నంలో ఉండటం సంతోషంగా ఉందని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడల అభివృద్ధికి చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. 

తన శ్రీమతి తెలుగు అమ్మాయి కావడం కూడా ఈ ప్రాజెక్టులో తాను భాగస్వామి కావడానికి ఓ కారణమని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువమంది ఒలింపియన్లు అందించడానికి కృషి చేస్తామని అన్నారు. ఇలాంటి ప్రయత్నం దేశంలోనే ఇదే మొదటిసారి అని చెప్పారు. 

కల్నల్ సీకే నాయుడు, ఎమ్మెస్కే ప్రసాద్, కోనేరు హంపి, పీవీ సింధు వంటివాళ్లు ఏపీ నుంచే వచ్చిన వాళ్లని ఆయన గుర్తు చేశారు.

loader