షాకింగ్ న్యూస్.. అంబటి రాయుడికి కెప్టెన్సీ బాధ్యతలు

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 11, Oct 2018, 10:51 AM IST
Ambati Rayudu To Lead Hyderabad In Quarterfinals Of Vijay Hazare Trophy
Highlights

ఈ నెల 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు బెంగళూరులో విజయ్ హజారే ట్రోఫీ జరగనుంది. దీనిలో హైదరాబాద్ సీనియర్ క్రికెట్ జట్టుకి అంబటి రాయుడు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

త్వరలో బెంగళూరులో జరిగే మ్యాచ్ కి అంబటి రాయుడు కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు బెంగళూరులో విజయ్ హజారే ట్రోఫీ జరగనుంది. దీనిలో హైదరాబాద్ సీనియర్ క్రికెట్ జట్టుకి అంబటి రాయుడు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఈ మేరకు 15 మంది సభ్యుల జట్టును హెచ్‌సీఏ బుధవారం ప్రకటించింది. అర్జున్‌ యాదవ్‌ కోచ్‌గా, ఎన్‌పీ సింగ్‌, దిలీప్‌ బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు. అక్షత్‌, తన్మయ్‌, సుమంత్‌ తదితరులు జట్టులో చోటు దక్కించుకున్నారు.
 
హైదరాబాద్‌ జట్టు: అంబటి రాయుడు (కెప్టెన్‌), అక్షత్‌రెడ్డి, తన్మయ్‌ అగర్వాల్‌, రోహిత్‌ రాయుడు, సుమంత్‌, సందీప్‌ (వికెట్‌కీపర్‌), మెహ్దీ హసన్‌, రవికిరణ్‌, సాకేత్‌ సాయిరామ్‌, సీవీ మిలింద్‌, ఆకాశ్‌ భండారి, రవితేజ, తనయ్‌ త్యాగరాజన్‌, ముదాసిర్‌ హుస్సేన్‌, అజయ్‌దేవ్‌ గౌడ్‌.

loader