విరాట్ కోహ్లీ ఇచ్చిన ఆ గిప్ట్ వల్లే ఐపీఎల్-11 లో రాణించా: అంబటి రాయుడు

Ambati rayudu Takes a Bat From Virat Ever Year
Highlights

భజ్జీ బ్లాస్ట్ షో లో ఆసక్తికర విషయాలు బైటపెట్టిన రాయుడు

ఐపీఎల్-11 సీజన్ లో తన బ్యాటింగ్ తో అద్భుత ప్రదర్శన కనబర్చిన హైదరబాదీ బ్యాట్స్ మెన్ అంబటి రాయుడు ఆ బ్యాటింగ్ వెనక ఉన్న రహస్యాన్ని తెలిపాడు. తానే ఈ సీజన్ లో వాడింది మామూలు బ్యాట్ కాదని...టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గిప్ట్ గా ఇచ్చిన బ్యాట్ అని తెలియజేశాడు. ఆ బ్యాట్ తో ఆడటం వల్లే ఇంత అద్భుతంగా బ్యాటింగ్ చేసి పరుగులు రాబట్టగల్గినట్లు రాయుడు వెల్లడించారు.

భజ్జీ బ్లాస్ట్ షో లో పాల్గొన్న రాయుడు పలు ఆసన్తికరమైన విషయాలను బైటపెట్టాడు. ప్రతి సంవత్సరం కోహ్లీ తనకు బ్యాట్ అందిస్తారని, అతడు ఇచ్చిన బ్యాట్ తో ఆడిన ప్రతిసారి బాగా పరుగులు సాదించానని తెలిపాడు. అందువల్లే ఈసారి అదే బ్యాట్ తో ఆడానని...తాను అనుకున్నట్లే రాణించి 602 పరుగులు సాధించి ఈ సీజన్ లో  అత్యధిక పరుగులు సాధించినవారి జాబితాలో టాప్ 4 గా నిలిచినట్లు రాయుడు తెలిపారు.

ఐపిల్ మొదలైనప్పటి నుండి రాయుడు ముంబై ఇండియన్స్ టీం తరపున ప్రాతినిద్యం వహించాడు. తాజాగా ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ అతడిని 2.20 కోట్లు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే గత సీజన్లకు బిన్నంగా అద్భుతంగా రాణించి చెన్నై ఫైనల్ కు చేరడంతో రాయుడు కీలక పాత్ర పోషించాడు. చెన్నై తరుపున అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచిన రాయుడు చివరకు ఐపిఎల్ విజేతగా చెన్నైని నిలబెట్టి తాను కూడా విన్నర్ గా నిలిచాడు.  

loader