దక్షిణాఫ్రికా క్రికెటర్ ఎబి డీవిలియర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

బెంగళూరు: దక్షిణాఫ్రికా క్రికెటర్ ఎబి డీవిలియర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. తక్షణమై తాను రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. 

తాను తప్పుకోవడానికి ఇదే సరైన సమయంగా తాను భావిస్తున్నట్లు ఆయన తెలిపాడు. దాంతో అతని 14 క్రికెట్ కెరీర్ ముగిసినట్లే. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తక్షణమై రిటైర్ కావాలని నిర్ణయించుకున్నట్లు ఆతను తెలిపాడు. 

114 టెస్ట్ మ్యాచులు, 228 వన్డేలు, 78 టీ20 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన తర్వాత మరొకరికి అవకాశం ఇవ్వడానికి ఇదే తగిన సమయమని, నిజాయితీగా చెప్పాలంటే తాను అలసిపోయానని, తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నాడు. 

ఇది అతి కష్టమైన నిర్ణయమేనని, తాను దీర్ఘంగా, చాలా ఆలోచించానని, బాగా ఆడుతున్నప్పుడే రిటైర్ కావడం మంచిదని అనిపించిందని ఆయన అన్నారు. భారత్, ఆస్ట్రేలియాలపై అద్భుతమైన విజయాల తర్వాత పక్కకు తప్పుకోవడానికి ఇదే తగిన సమయమని అనిపించినట్లు తెలిపాడు. 

విదేశాల్లో ఆడే ప్లాన్స్ ఏవీ లేవని, దేశవాళీ క్రికెట్ లో టైటాన్స్ కు అందుబాటులో ఉంటానని, ఫాప్ డూ ప్లెసిస్ కు, ప్రొటియాస్ కు తాను పెద్ద మద్దతుదారును అని అన్నారు. దక్షిణాఫ్రికా, ప్రపంచ క్రికెట్ అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Scroll to load tweet…