1xBat: ఎంటర్‌టైనర్స్‌ క్రికెట్‌ లీగ్‌కు స్పాన్సర్‌గా 1xBat.. వినోదం, క్రీడల సమ్మేళనం

2025, మార్చి 5 నుంచి మార్చి 16 వరకు జరిగే ఎంటర్‌టైనర్స్‌క్రికెట్‌ లీగ్‌ సీజన్‌ 2కి, స్పోర్ట్స్‌ న్యూస్‌ పోర్టల్‌ 1xBat స్పోర్టింగ్‌ లైన్స్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ప్రారంభ సీజన్‌ విజయవంతం కాగా, రెండో సీజన్‌ సైతం క్రికెట్‌ అభిమానులకు మరింత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు, వినోదాన్ని అందిస్తుందని ECL హామీ ఇస్తుంది. ఎంటర్‌టైనర్స్‌ క్రికెట్‌ లీగ్‌ (ECL) అనేది ఒక ప్రత్యేకమైన T10 ఫార్మాట్‌ క్రికెట్‌ లీగ్‌, ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ స్టార్స్‌, ప్రతిభావంతులైన స్ట్రీట్‌ ప్లేయర్లను ఇది ఒకచోటకు చేర్చుతుంది.
 

1xBat Sponsors Entertainers Cricket League (ECL) Season 2 Merging Sports & Entertainment

అందరికి ఇష్టమైన క్రీడను వినోదంతో కలపడం, క్రికెట్ అభిమానులు, ఇన్‌ఫ్లూయెన్సర్లకున్న విస్తృత ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించడంతో ECL తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందింది. సోషల్‌ మీడియా, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో లీగ్‌ ఎప్పటికప్పుడూ చురుగ్గా సంభాషిస్తుంది- ఇందులో క్రమం తప్పకుండా అప్‌డేట్స్‌తో పాటు ప్రకటనలు పోస్ట్‌ చేస్తారు. ప్రముఖుల ప్రమేయం, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లతో ఏకీకరణ ద్వారా, యువతలో క్రికెట్‌ పట్ల ప్రాచుర్యం పొందేలా చేయడంలో ECL సహాయపడుతుంది. అలాగే భారతదేశంలో సాంప్రదాయ క్రీడా కార్యక్రమాల సరిహద్దులను మరింత విస్తరించేలా చేస్తుంది. ఎంటర్‌టైనర్స్‌ క్రికెట్ లీగ్‌ (ECL)తో పాటు మా వ్యాపారంలోనూ వినోదంతో పాటు క్రీడలనేవి అత్యంత కీలకమైనవి. క్రికెట్‌కు సపోర్ట్‌ చేయడం అదే సమయంలో ఎంటర్‌టైనర్స్‌ క్రికెట్‌ లీగ్‌ సృష్టి దాని అభివృద్ధి వెనక ఉన్న విలువలను పంచుకోవడం తమ లక్ష్యమని తెలిపారు.  

ఇది దాని ప్రభావాన్ని బలోపేతం చేయడంతో పాటు ఈ క్రీడ ప్రజాదరణను మరింత పెంచడంలో దోహదపడుతుందని అందుకే లీగ్‌తో ఈ భాగస్వామ్యంపై సంతకం చేయడానికి తాము సంతోషిస్తున్నామంటూ 1xBat ప్రతినిధి తెలిపారు. ECLలో పాల్గొనే ప్రతి జట్టులో 20 మంది ఆటగాళ్లు ఉంటారు. వీరిని వేలం ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఏడాది వేలం జనవరి 13న జరగ్గా, కొత్త సీజన్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా క్రికెటర్‌ బాబీ యాదవ్ నిలిచాడు. ఇతని కోసం లక్నో లయన్స్‌ రూ. 2.80 కోట్లు ఖర్చు చేసింది. జాబితాలో రెండో స్థానంలో యూట్యూబర్‌ ఝల వన్‌రాజ్‌సిన్హ్‌ ఉండగా, బెంగళూరు బాషర్స్‌ ఇతని కోసం రూ. 2.60 కోట్లు వెచ్చించింది. రూ. 2.50 కోట్లతో హర్యాన్వి హంటర్స్‌ కొనుగోలు చేసిన విశాల్‌ చౌదరి మూడో స్థానంలో ఉన్నారు.

ECL రెండవ సీజన్‌లో, జట్ల సంఖ్య ఐదు నుంచి ఎనిమిదికి పెరిగింది: హర్యాన్వి హంటర్స్‌- ఎల్విష్‌ యాదవ్‌- కెప్టన్‌ (యూట్యూబర్‌, సింగర్‌), లక్నో లయన్స్‌- అనురాగ్‌ ద్వివేది- కెప్టన్ (ఫాంటసీ క్రికెట్‌ నిపుణుడు, యూట్యూబర్‌, క్రికెట్‌ విశ్లేషకుడు). ముంబై డిస్‌రప్టర్స్‌- మునావర్‌ ఫరూఖీ- కెప్టన్‌ (స్టాండప్‌ కమెడియన్‌, యూట్యూబర్‌, రాపర్‌, సింగర్‌), డైనమిక్‌ ఢిల్లీ- గౌరవ్‌ తనేజా- కెప్టన్‌ (యూట్యూబర్‌, కంటెంట్‌ క్రియేటర్‌, కమర్షియల్‌ పైలట్‌, ఫిట్నెస్‌,లైఫ్‌స్టైల్‌), బెంగళూరు బాషర్స్‌- అభిషేక్‌ మల్హన్‌- కెప్టన్‌ (యూట్యూబర్‌, రాపర్‌, సింగర్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌), కోల్‌కతా సూపర్‌స్టార్స్‌- పుష్కర్‌ రాజ్‌ థాకూర్‌- కెప్టన్‌ (స్టాక్‌ మార్కెట్‌ ఎడ్యుకేటర్‌చ ఫైనాన్స్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌, బిజినెస్‌ కోచ్‌, యూట్యూబర్‌) చెన్నై స్మాషర్స్‌- మహేష్‌, తుగేష్‌, కేష్వాలా- కెప్టన్‌ (యూట్యూబర్‌, కంటెంట్‌ క్రియేటర్‌), రాజస్థాన్‌ రేంజర్స్‌- ఝైన్‌ సైఫీ- కెప్టన్‌ (యాక్టర్‌, యూట్యూబర్‌) ఉన్నారు. 

దీంతో అభిమానులు మైదానంలో మరిన్ని కొత్త ముఖాలను చూస్తారు, టోర్నమెంట్‌ మరింత పోటీతత్వంతో ఇంకా ఉత్తేజకరంగా ఉంటుంది. లీగ్‌ రెగ్యులర్‌ సీజన్లలో, అన్ని జట్లు ప్రతి ప్రత్యర్థిని రెండుసార్లు ఎదుర్కొంటాయి, ఇందువల్ల 32 మ్యాచ్‌లు ఆడతాయి. సీజన్‌ ముగింపులో, లీగ్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న నాలుగు అగ్ర జట్లు ఎంటర్‌టైనర్స్‌ క్రికెట్‌ లీగ్‌ సీజన్‌ 2 ఛాంపియన్స్‌ టైటిల్‌ కోసం పోటీ పడతాయి. ECL ప్రారంభ సీజన్‌ను కెప్టన్‌ ఎల్విష్‌ యాదవ్‌ నేతృత్వంలోని హర్యాన్వి హంటర్స్‌ గెలుచుకుంది. సంతకం చేసిన స్పాన్సర్‌షిప్‌ ఒప్పంద నిబంధనల ప్రకారం, ఆటలు జరుగుతున్న సమయంలో స్టేడియం ప్రకటనల బోర్డుల్లో 1xBat లోగోను ప్రదర్శిస్తారు. 1xBat తన డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌తో పాటు సోషల్‌ మీడియాలోనూ ECL టోర్నమెంట్‌ను చురుగ్గా కవర్‌ చేస్తుంది, లీగ్‌కు చెందిన టాప్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌లు బ్రాండ్‌కు సంబంధించిన పోస్ట్‌లను తిరిగి అనేక మంది సబ్‌స్కైబర్లకు పోస్ట్‌ చేస్తారు. ఈ విధంగా, 1xBat వీక్షణల సంఖ్య పెంచడంతో పాటు సోషల్‌ మీడియా, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ ఇతర మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రేక్షకుల్లో క్రికెట్‌పై ప్రజాదరణను ప్రోత్సహిస్తుంది. 

1xBat స్పోర్టింగ్‌ లైన్స్‌ అనేది భారతదేశానికి చెందిన ఆన్‌లైన్‌ న్యూస్‌ ప్లాట్‌ఫామ్‌, క్రీడలకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన వార్తలు మీకు ఇక్కడ లభిస్తాయి. క్రికెట్‌, ఫుట్‌బాల్‌, కబడ్డీ సహా అనేక ఇతర క్రీడలకు సంబంధించిన అప్‌డేట్‌లను 1xBat పాఠకులు ఎప్పటికప్పుడూ పొందుతుంటారు. ఈ సైట్‌ను సందర్శించే వారు జట్టు ర్యాంకింగ్‌లను చూడటంతో పాటు క్రీడా కార్యక్రమాల అంచనాలను తెలుసుకోవచ్చు. క్రికెట్‌ ప్రముఖ ఆటగాళ్లైన శిఖర్‌ ధావన్‌, మిచెల్‌స్టార్క్1xBat అధికారిక బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఉన్నారు. అలాగే, ఈ న్యూస్‌ ప్లాట్‌ఫామ్‌ ప్రో కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌ కోసం తమిళ్‌ తలైవాస్‌తో స్పాన్సర్‌షిప్‌ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ బ్రాండ్‌ అబుదాబిలో జరిగిన T10 2024 క్రికెట్‌ లీగ్‌ 8వ సీజన్‌కు భాగస్వామిగా అధికారిక స్పాన్సర్‌గా ఉంది అలాగే ILT20 2025లో డెజర్ట్‌ వైపర్స్‌ జట్టుకు కూడా స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios