మెల్ బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియా జట్టు నడ్డివిరిచి తన అద్భుత బౌలింగ్ తో ఆకట్టుకున్న టీంఇండియా యువ బౌలర్ జస్ప్రీత్ సింగం బుమ్రాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. బుమ్రా విసిరిన చురకత్తులాంటి బంతుల్ని ఎదుర్కోలేక ఆసిసి బ్యాట్ మెన్స్ చేతులెత్తేశారు. ఇలా భారత్ కు ఆధిక్యాన్ని కట్టబెట్టి విజయానికి చేరువ చేసిన బుమ్రాను భారత మాజీ ఆటగాడు, బౌలర్ జవగల్ శ్రీనాథ్ అభినందనలతో ఆకాశానికెత్తేశారు. 

బుమ్రా తన కెరీర లోనే అత్యుత్తమ ప్రదర్శనను (6/33) ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై అది ఎంసిజి స్టేడియంలో చేయడం అత్యద్భుతమని శ్రీనాథ్ అన్నారు. ఈ ఇన్సింగ్స్ లో బుమ్రా బౌలింగ్ చేసిన తీరు చాలా తక్కువ సందర్భాల్లో చూస్తామన్నారు. ఇది తప్పకుండా ఆస్ట్రేలియాలో బెస్ట్ బౌలింగ్ స్పెల్ అని తాను బావిస్తున్నట్లు శ్రీనాథ్ అభిప్రాయపడ్డారు. 

బుమ్రా ఎలాంటి సందర్భాల్లో అయినా అద్భుతంగా బౌలింగ్ చేయగలడని శ్రీనాథ్ పేర్కొన్నారు. ఈ టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో బుమ్రా స్పెల్ మొత్తం కాదు...అతడు వేసిన ప్రతి బంతి అద్భుతమన్నారు. మొత్తానికి బుమ్రా భారత బౌలర్ల ప్రతిభ ఏంటో ఆస్ట్రేలియా జట్టుకు రుచి చూపించాడంటూ శ్రీనాథ్ పొగిడారు. 

మెల్‌బోర్న్‌ లో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 151 పరుగులకే ఆలౌటయ్యింది. టీంమిండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఆస్ట్రేలియా జట్టును  కుప్నకూల్చడంలో ప్రముఖ పాత్ర వహించాడు.  ఇలా తన అద్భుత ప్రదర్శనతో బుమ్రా భారత్‌కు 292 పరుగుల ఆధిక్యాన్ని అందించాడు.

మరిన్ని వార్తలు

39ఏళ్లనాటి రికార్డును బద్దలు కొట్టిన బుమ్రా

మెల్బోర్న్ టెస్ట్: ముగిసిన 3వ రోజు ఆట, భారత్ విలవిల