మీ ముక్కు సైజే... మీ పురుషాంగం సైజు కూడా...!
ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే... ముందు వారి ముక్కు కోసేసేవారట. అయితే... అది వారి నమ్మకం అని మాత్రమే అనుకున్నారు. కానీ.. ఇప్పుడు అదే నిజం అని తేలింది.
పురుషుల పురుషాంగం సైజు విషయంలో చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి. పురుషాంగం పరిమాణం చిన్నదిగా ఉంటే.. వారు శృంగారానికి పనికిరారు అనే అనుమానం కూడా చాలా మందిలో ఉంది. అంతెందుకు.. దాని సైజు పెంచకోవడానికి చాలా మంది చాలా వింత ప్రయత్నాలు చేసిన వారు కూడా ఉన్నారు. ఆ సంగతి కాసేపు పక్కన పెడితే..... తాజాగా... దీని గురించి ఓ కొత్త విషయం తెలిసింది.
రోమన్ మహాసామ్రాజ్యంలో పురుషుల పురుషాంగానికి సంబంధించి ప్రజల్లో ఓ నమ్మకం ఉండేదట. ఒక వ్యక్తి ముక్కు పరిమాణం ఎంత ఉంటే.. వారి అంగ పరిమాణం కూడా అంతే ఉంటుందని అక్కడి వారు నమ్యమేవారట. అందుకు తగినట్లుగానే శిక్షలు కూడా ఉండేవట. ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే... ముందు వారి ముక్కు కోసేసేవారట. అయితే... అది వారి నమ్మకం అని మాత్రమే అనుకున్నారు. కానీ.. ఇప్పుడు అదే నిజం అని తేలింది.
క్యోటో ప్రిఫెక్చూరల్ యునివర్శిటీ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం తేలడ గమనార్హం. దీనికి వారు దాదాపు 126 మంది పరుషుల మృతదేహాలను పరిశీలించి మరీ తేల్చడం గమనార్హం. వారు ఎంచుకున్న పురుషులంతా 30 నుంచి 50ఏళ్ల లోపువారు కావడం గమనార్హం.
ఈ అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు వారి అంగపరిమాణంతో పాటూ ముక్కు పొడుగు, వెడల్పు, మనిషి పొడవు, వెడల్పు, బాడీ షేప్ ఇలా అన్నింటినీ పరిశీలించడం గమనార్హం. పురుషాంగాన్ని కొలిచే సమయంలో వారు కొన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకున్నారట. వారు తీసుకున్న కొలతలను పరిశీలించగా.. పురుషుల ముక్కు.. వారి పురుషాంగ పరిమాణం సమానంగా ఉన్నట్లు గుర్తించడం గమనార్హం. చిన్న ముక్కు ఉన్నవారికి దాని పరిమాణం చిన్నగానూ.. పెద్ద ముక్కు ఉన్నవారికి పెద్దగానూ కనిపించిందట.
మరో పరిశోధనలో చూపుడు వేలు, ఉంగరం వేలు పొడవుల నిష్ఫత్తిపై అంగం సైజు ఆధారపడి ఉంటుందట. ఈ నిష్పత్తి తక్కువగా ఉండే వారి అంగం పొడవు ఎక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేలడం గమనార్హం. అయితే... వీటిని బట్టి మనం పూర్తిగా అంచనా వేయలేమని వాదించేవారు కూడా లేకపోలేదు.