Asianet News TeluguAsianet News Telugu

లవ్ స్టోరీ: ఒకరికి ఒకరు

చిన్నప్పటి చిలిపి చేష్టలన్నీ రు. సిగ్గు. ఇదే కొత్తదనం వారిని ఉక్కిరిబికి ఎగిసిపడకుండా జాగ్రత్తపడుతున్నారు.చేపలన్నీ గుర్తిస్తుంటే ఒకరినొకరు చూసుకోవాలంటే బిడియం.వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 

Love story: Made for each other
Author
Hyderabad, First Published Aug 25, 2019, 3:53 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సూర్యుని చుట్టూ వదరగూడు. “వాన వచ్చేట్లే ఉంది" అన్నాడు నరేంద్ర. బావిలో కప్పల బెకబెకలు. “నిజమే” అంది మల్లిక.గట్టిగా శ్వాస పీల్చి “వాన వస్తోంది” అన్నాడు నరేంద్ర. ఇద్దరూ నడుస్తున్నారు మట్టి బాట మీద. పక్కన పచ్చని మైదానంలో లేగదూడ ఒక్కటే పరుగులు తీస్తున్నది. దాన్ని చూపించి – “నిజమే వాన వస్తుంది” అంది మల్లిక.

ఎక్కడి నుంచి వచ్చాయో గాని ఆకాశం మీద నల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా వచ్చి చేరాయి. సూర్యుడు మబ్బుల చాటుకు వెళ్లిపోయాడు. పగలే చీకటి అయింది. చల్లటి గాలి వీయసాగింది.“మబ్బులు చెదిరిపోతాయేమో” అన్నాడు. “ఈ మాత్రం గాలికి ఏమీ కాదులే" అంది.

ముందే ప్రకృతి సూచనలు ఇస్తుంది. దాన్ని పశువులు, మనుషులు గుర్తుపట్టడం జరుగుతుందనడానికి ఇదో సూచన. ఇద్దరూ నడుస్తున్నారు. వాగులోకి వచ్చేసరికి చినుకులు పడడం ప్రారంభమైంది. ఒంటి మీద పడ్డ చినుకులు రాళ్లలా తాకసాగాయి. పక్కన గుబురు గుబురుగా చెట్లు. వాన జోరు హెచ్చింది. ఏ చెట్టు కూడా వాన నుంచి రక్షణ కల్పించే స్థితిలో లేదు. ఇద్దరూ తడిసి ముద్దయ్యారు. అయినా నడుస్తూనే వున్నారు. నరేంద్ర మల్లికను చూశాడు. ఆమె తల మీద పడిన నీరు ముక్కు మీదికి, పెదవుల మీదికి జారి కింద పడుతున్నాయి. చలికి పెదవులు టపటపమని కొట్టుకుంటున్నాయి. అతను కూడా చలికి వణికిపోతున్నాడు.

గువ్వపిట్టలా ముడుచుకుపోయి నడుస్తోంది ఆమె. “చింత చెట్టు కింద ఆగుదాం” అన్నాడు నరేంద్ర. ఇద్దరూ పక్కనే వున్న చింతచెట్టు కిందికి చేరారు. ఆకాశంలో పెద్దగాఉరుము. ఆ తర్వాత తీగలు తీగలుగా మెరుపులు. ఆ ఉరు ఒళ్లు జలదరించింది.

“భయమేస్తోందా?” అని అడిగాడు.

ఆమె చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో అప్పుడప్పుడే మందారాలు. ముద్దబంతిలా ఆమె.

“ఉరుము ఉరిమితే అర్జునా ఫల్గుణా పార్ధా కిరీటి అంటూ ఒ. పది పేర్లు చదివేవాళ్లం గుర్తుందా? అది చదివితే అర్జుని రథం నుంచి, శిల పిడుగై మనమీద పడదని నమ్మకం వుండేది” అని అన్నాడు.

“అర్జుని రథాన్ని కృష్ణుడు నడుపుతుంటాడని, ఆ రథం మేఘాల మీద పరుగు పెడుతుందని, అప్పుడప్పుడు ఆ రథం శిల ఊడిపడుతుందని, అనే పిడుగని అనుకునేవాళ్లం” అంది మల్లిక. .

మాటలు పెదవులు దాటి ముద్ద ముద్దగా వస్తున్నాయి.

ఏదో వేరే ప్రపంచంలో ఉన్నట్టుంది ఇద్దరికి కూడా. చిన్నప్పుడు ఇద్దరికీ ఇటువంటి అనుభవాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు మాత్రం కొత్తగా వుంది. అప్పుడు లేని అనుభూతేదో గుండెలను సన్నగా మీటుతోంది. వయసు తేడా వల్ల వచ్చిన అనుభూతి ఇది. మల్లిక నరేంద్రకు స్వయానా మరదలు. మేనత్తను, మామను, ఆ సాకుతో బావను చూద్దామని ఈ ఊరు వచ్చింది. ఆమె ఊరికి వచ్చి వారం రోజుల పైనే అవుతోంది. ఈ రోజు సరదాగా బాయి వద్దకని బయలుదేరారు. బాయి దగ్గర వాళ్లు చేసింది కూడా ఏమీ లేదు. నగరంలో చదువుకునేవారికి ఏ పనీ రాదనే ఉద్దేశంతో వారిని ఏ పనీ చేయనివ్వలేదు. బాయిగడ్డ మీద చింతచెట్టు కింద చాలాసేపు కూర్చున్నారు. చేనంతా తిరిగి చూశారు. దొరికిన కాయలు కొరికి తిన్నారు. తీరా ఇంటికి బయలుదేరేసరికి వా తగులుకుంది. చింతచెట్టు గాలికి ఊగుతుంటే చెట్టు మీది నీటిచుక్కలు రాలి పడుతున్నాయి. అవి వాన చినుకులకన్నా పెద్దగా వున్నాయి. అవి మీద పడినప్పుడు ఒళ్లు జలదరిస్తోంది. చింతచెట్టు చుట్టూ కొంత భాగాన్ని మినహాయిస్తే అంతటి నీళ్లు. ఆ నీళ్లకేదో ఆకర్షణ ఉంది. వాటిలో దూకి కేరింతలు కొట్టాలనిపిస్తోంది. కాగితపు పడవలు చేసి నీళ్లలో వదలలనిపిస్తోంది. ఏ మాయాజలతారో వచ్చి తమిద్దరిని వేరే లోకాలకు తీసికెళ్తే బాగుండునని అనిపిస్తోంది. చాలాసేపు ఈ మౌనం వహించారు. ఇద్దరిలో పరిపరి విధాల ఆలోచనలు, ఊహలు, కోరికలు.

చిన్నప్పటి చిలిపి చేష్టలన్నీ రు. సిగ్గు. ఇదే కొత్తదనం వారిని ఉక్కిరిబికి ఎగిసిపడకుండా జాగ్రత్తపడుతున్నారు.చేపలన్నీ గుర్తిస్తుంటే ఒకరినొకరు చూసుకోవాలంటే బిడియం.
వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తమ లోలోని భావాల ఉప్పెనలు చాగతపడుతున్నారు. ఒకరికొకరికి విడదీయరాని సాన్నిహిత్యం.అదే సమయంలో దగ్గర కాలేని దూరం. ఎమిటీ వింత?నరేంద్ర ఆమె వైపు చూశాడు. మల్లిక చలికి పిట్టలా వణికిపోతోంది. గుండెలు ఎగిసిపడుతున్నాయి.

నిజానికి నరేంద్ర పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీలేదు. వాన వెలిసింది. సూర్యుడయితే మబ్బులు దాటి రాలేదు. కానీ వెలుగుపరుచుకుంది. నూహ్యంగా ఇంత పెద్ద వర్షం కురిసి అంతే త్వరగా వెలిసి వెలుగురావడం ఎంతగా ఉంది. అదో అద్భుతంగా వుంది. ఈ వెలుగుకు తమ మనసులు తేలికపడ్డట్టు అనిపించింది వారికి. అనుభూతల భారాన్ని దింపుకొని వారిద్దరూ తేటపడ్డారు.

ఆమె తన చీర కొంగును గట్టిగా పిండి ముఖం తుడుచుకుంది. అలా రెండు మూడు తడవలు చేసిన తర్వాత ముఖం తేటపడింది. అతను ఆమెనే చూస్తుండిపోయాడు. మల్లిక అతడ్ని చూసింది. అతను తన ఒంటిమీది తడిని తుడుచుకోవడానికి ఏ ప్రయత్నమూ చేయలేదు.
ఆమె చీర కుచ్చిళ్లను దగ్గరకు చేర్చి పిండుకుంది. పాదాలు తడిసి అక్కడక్కడా ముడతలు పడ్డాయి. అతని ఒంటి మీది నుంచి ఇంకా నీరు కారుతూనే వుంది. ఆమెనే చూస్తూ నిలుచుండిపోయాడు. ఆమె అతడిని పరిశీలనగా చూసింది. ఆమె చూపును గమనించి చేతితో ముఖం మీది నీళ్లను తుడుచుకునే ప్రయత్నం చేశాడు.

“చలి పెడుతోందా?” అని అడిగాడు. ఆమె పెదవి విప్పకుండానే అవునన్నట్లు తల ఊపింది. అలా ఊపిన పద్దతి అతనికి ముద్దొచ్చింది. ఆమెను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకోవాలనిపించింది. తన కోరికను బలవంతంగా ఆపుకున్నాడు. ఇద్దరు అక్కడి నుంచి కదిలారు. దారిలో అన్నీ నీళ్లే. అక్కడక్కడ మోకాళ్ల లోతు నీళ్లు, నీళ్లు చాలా ఎక్కువగా ఉన్న చోట ఆమె చీరను పైకి లేపుకుని నడవసాగింది. అది అతనికి కొత్తగా వుంది. అతను నీళ్లను లెక్క చేయడం లేదు. బట్టలు తడిసి ముద్దయినాసరే అలాగే నడుస్తున్నాడు. ఇప్పుడతనికిఏదీ పట్టేట్టు లేదు. అతని మది నిండా ఆమెనే నిండిపోయి ఉంది. నల్లని మేఘంలాఅతని సునసు బరువుగా, తీరుగా ఉంది. బహుశా ఆమె పరిస్థితి కూడా అదేనేమో!

కలిస్తే చాలు, గలగలా మాట్లాడుకునే ఆ ఇద్దరి మధ్య ఇప్పుడు అసాధారణమైన నిశ్సబ్దం. ఇది చాలా కొత్త విషయం. ఈ మార్పు ఇంత హఠాత్తుగా నచ్చేస్తుందని నారనుకోలేదు. చాలా సందర్భాల్లో అతను ముందు నడుస్తుంటే ఆమె వెనక నడవసాగింది. ఇంతకు ముందయితే గలగలా మాట్లాడుతూ పక్కనే నడిచేది. అలా ఆమె వెనక వస్తున్నప్పుడు అతను పదేపదే ఆగుతూ ఆమె దగ్గరయ్యేవరకు ఆగిపోసాగాడు. అది అతనికి కొత్తగా వుంది. ఒక తీయటి బాధ్యతేదో మీద పడినట్టుంది అతనికి. ఆమెను పువ్వుల్లో పెట్టి ఆ సుకుమారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తన మీదే ఉందనిపించింది. ఇంతకు ముందు ఇలాంటి ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఈ అద్భుతమైన భావన ముందు ప్రపంచంలో ఏదీ నిలవదని అనిపించింది. దేవుడి కోసమే పూసిన పువ్వులా మల్లిక తనకోసమే పుట్టిందన్న భావన అతన్ని తీయటి తలంపులోకి తీసికెళ్లింది.

ఇంటికి చేరుకునేవరకు కూడా వారిద్దరి మధ్య మాటలు లేవు. ఇద్దరు కూడా తమలో తామే మాట్లాడుకుంటూ ఉండడంతో ఒకరితో ఒకరు మాట్లాడే పరిస్థితి రాలేదు. తమతో తామే మాట్లాడుకుంటున్నామనే విషయం వారికి అర్థం కాలేదు. దానివల్ల ఈ పరిస్థితి వారికి ఊపిరి సలపనీయడం లేదు.

ఇద్దరూ చెరో గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకున్నారు. మల్లిక టీ తెచ్చి అతనికి ఇచ్చింది. టీ తీసుకుని మంచం మీద కూర్చున్నాడు. వెచ్చని బట్టలు, ఆ వాతావరణం నరేంద్రకు హాయిగా ఉంది. ఇంతటి హాయిని మునుపెన్నడూ అనుభవించలేదు. పొగలు కక్కుతున్న టీ గొంతులోకి జారుతుంటే గుండె వెచ్చ పడుతోంది. ఆమె అతనికి కాస్త దూరంలో కూర్చుని తల వంచుకుని టీ తాగుతోంది. ఇంతకు ముందు తనకు చాలా చేరువగా కూర్చునేది. ఇప్పుడు దూరంగా కూర్చున్నా మునుపటి కన్నా దగ్గరగా అనిపిస్తోంది. టీ తాగేసి కప్పు చేతిలో పట్టుకున్నాడు. ఆమె ఆ కప్పును తీసుకుంది. అలా తీసుకోవడంలో అతని పట్ల ఆమెకేదో బాధ్యత పెరిగిన భావన వ్యక్తమైంది.

ఒకరి పట్ల ఒకరికి అపారమైన ఇష్టముంది. ఆ ఇష్టమే ఇద్దరి మధ్య సంభాషణ ఎడతెగకుండా నడిపించేది. ఆమెను సంతోషపెట్టే మాటలు అతను మాట్లాడేవాడు. అతడ్ని సంతోషపెట్టే మాటలు ఆమె మాట్లాడేది. ఒక్క వాన కారణంగా ఇద్దరి మధ్య బాధ్యతాయుతమైన మౌనమేదో ఆవరించింది. ఇప్పుడు వాన ఆ ఇద్దరి హృదయాలను ఏకం చేసినట్లుంది. ఒకరి అవసరాలను ఒకరుగుర్తించి నడుచుకోవాలనే ఆరాటం ఈ కొద్ది గంటల్లోనే ఏర్పడింది. ఒకరికొకరు విడదీయలేనంతగా ఒక్కటైపోయినట్టు ఉంది. తమ శరీరాలపై తమకు కొత్తగా సునం పెరిగినట్టు కూడా ఉంది. ఈ శరీరస్పృహ వారిలో ఒక అస్తిత్వాన్ని, ఒక ప్రత్యేకతను తెచ్చి పెట్టింది.

మల్లిక నరేంద్రతో మాట్లాడడం చాలా వరకు తగ్గించింది. ఇంతకు ముందయితే దేన్నీ పట్టించుకోకుండా అతనితోనే ఉండిపోయి మాటలు చెప్తూ వుండేది. అతను అలగే మాట్లాడేవాడు. ఇప్పుడు ఎక్కువగా ఆమె మేనత్తతో వుంటోంది. ఆమెను ఒంటరిగా చూడాలంటే కూడా అతనికి కష్టమైపోతోంది. అతని మనసేమో ఆమె కోసం తపించిపోతోంది. మల్లికలో ఏదో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మల్లిక తన అలంకరణ మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు అతనికి అర్థమైపోతూనే ఉంది. ఇదంతా నా కోసమే కదా అని అనుకున్నప్పుడు అతని మనసు తృప్తితో నిండిపోసాగింది.

ఆమె తమ ఊరికి బయలుదేరడానికి ముందు అతని గదిలోకి వచ్చింది. చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి ఆమె వైపు చూశాడు.

“నేను వెళ్లిస్తా” అంది మెల్లగా. “అప్పుడే” అన్నాడతను. ఆమె మాట్లాడలేదు. అతను ఆమెకు దగ్గరగా వచ్చాడు. ఆమె కాస్త వెనక్కి జరిగింది.

“నిన్ను చూడకుండా ఉండలేనేమో..” అని అతను అన్నాడు. ఆమె కూడా అదే భావాన్ని మౌనంగా వ్యక్తం చేసింది.

“పెళ్లే దీనికి మార్గం కదూ!” అన్నాడతను.

“పెళ్లి తర్వాత కూడా ఈ ఇష్టం, ప్రేమ నిలిచే వుంటాయంటావా?” అంది మెల్లగా.  అతనికి ఆశ్చర్యం వేసింది. ఈ ప్రశ్న తాను ఎప్పుడూ వేసుకోలేదు. గొంతులో రాయేదో అడ్డం పడినట్లు అనిపించింది.

“ఆ ప్రేమను, ఇష్టాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం” అన్నాడు. 

“పెళ్లి ప్రేమను, ఇష్టాన్ని చంపేస్తుందేమోనని భయంగా వుంది” అందిమలిక

“పెళ్లి తర్వాత ఎప్పుడైనా యాంత్రికమైనట్లు అనిపిస్తే ఈ వర్షం మిగల్చిన అనుభూతులను, జ్ఞాపకాలను నెమరేసుకుని మళ్లీ కొత్తగా చిగురవేసిన మొక్కలా జీవితాలను ఆనందమయం చేసుకోలేమా?” అని అందామనుకున్నాడు. మనసులోని మాట పెదవులు దాటి వచ్చేలోగానే ఆమె కదిలిపోయింది.

Follow Us:
Download App:
  • android
  • ios