సురక్షిత శృంగారానికి కండోమ్స్ వాడండి అని ప్రభుత్వాలే ప్రచారం చేస్తూ ఉంటాయి. సుఖ వ్యాధులు ముఖ్యంగా హెచ్ఐవీ, ఎయిడ్స్ లాంటి ప్రాణాంతక వ్యాధులు దరిచేరకుండా ఉండేందుకు చాలామంది ఈ కండోమ్స్ నివాడుతుంటారు. అంతేకాదు.. అవాంచిత గర్భానికి చోటుఇవ్వకుండా కూడా ఇవి సహాయపడతాయి. 

కండోమ్ వాడాలంటూ ప్రతి దేశంలోని ఆ దేశ ప్రభుత్వాలే చెబుతూ ఉంటాయి. అయితే.. బ్రిటన్ ప్రభుత్వం మాత్రం దాదాపు 90 వేల కండోమ్ ప్యాకెట్లను సీజ్ చేసింది. ఆ కండోమ్స్ వాడకండి అంటూ ప్రజలకు వార్నింగ్ కూడా ఇచ్చింది.

నిబంధనలకు విరుద్ధంగా, భద్రతకు ఆస్కారం లేని 90వేల కండోమ్ ప్యాకెట్లను బ్రిటన్ ప్రభుత్వం సీజ్ చేసింది. 2018, 2019 ఈ రెండేళ్ల కాలంలోనే వీటన్నింటినీ సీజ్ చేయడం గమనార్హం.  ది మెడిసిన్ అండ్ హెల్త్ కేర్  ప్రాడక్ట్స్ రెగ్యులరేటరీ ఏజెన్సీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

Also Read పడక గదిలో ప్రియురాలి ప్రతాపం.. ప్రియుడికి గాయాలు

సీజ్ చేసిన వాటిలో ఎక్కువ శాతం ఎక్స్ పైరీ డేట్ అయిపోయాయని, మరికొన్ని భద్రతా పరీక్షలు చేయకుండా తాయరు చేశారని,మరి కొన్ని ప్యాకెట్ల కవర్లపై ఎలంటి చట్టపరమైన హెచ్చరికలు లేవని  వారు చెప్పారు. 2018లోనే 87,500 కండోమ్ ప్యాకెట్లను బ్రిటన్ బార్డర్ ఫోర్స్ అధికారులు కనుగొని సీజ్ చేశారు.

కాగా,, కండోమ్స్ కొనుగోలు చేసేటప్పుడుడ వైద్యుల సలహా తీసుకోవాలని చెబుతున్నారు. వైద్యులు చేసిన సూచనల మేరకే వాటిని కొనుగోలు చేయాలని అధికారులు  చెబుతున్నారు. మార్కెట్ లో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద సంఖ్యలో కండోమ్ లు చలామణి అవుతున్నాయని వారు చెబుతున్నారు. ఇలాంటివాటి వల్ల గర్భనిరోధకాన్ని అరికట్టలేమని... దీనితోపాటు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.