Asianet News TeluguAsianet News Telugu

పిల్లలు త్వరగా నిద్రపోవాలంటే ఏం చేయాలి?

పిల్లలు రాత్రి ఒక్కటైనా, రెండైనా నిద్రపోనే పోరు. అలాగే ఇంట్లో వాళ్లను కూడా పడుకోనివ్వరు. ఏ ఒక్కరూ మెలుకువ లేకపోయినా ఒక్కటే ఏడుస్తుంటారు. అయితే మీరు కొన్ని ట్రిక్స్ ను ఫాలో అయితే మాత్రం మీ పిల్లలు మీకంటే ముందే నిద్రపోతారు. 

 what is the fastest way to fall asleep for kids rsl
Author
First Published Jun 29, 2024, 11:58 AM IST

పిల్లలకు నిద్ర చాలా అవసరం. నిద్రతోనే పిల్లలు హుషారుగా, హెల్తీగా ఉంటారు. అయితే ఏ వయసు పిల్లలు ఎంత సేపు నిద్రపోవాలో చాలా మందికి తెలియదు. ఇదే తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారుతుంది. మరి ఏ వయసు పిల్లలు ఎంత సేపు నిద్రపోవాలి? పిల్లలు త్వరగా నిద్రపోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

పిల్లలకు నిద్ర ఎంత ముఖ్యం?

పొద్దున్నే లేచి ఆడుకునే పిల్లలకు నిద్రచాలా చాలా అవసరం. ఇలాంటి పిల్లల మెదడులోని నాడీ కణాలు పెరుగుతాయి. వీళ్లు రాత్రిపూట బాగా నిద్రపోతేనే ఉదయం రిఫ్రెష్ గా ఫీలవుతారు. అలాగే పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. కండరాల నష్టం కూడా నిద్రలోనే సరి అవుతుంది. శరీర పనితీరుకు, బరువును నిర్వహించడానికి పిల్లలకు రాత్రి నిద్ర చాలా అవసరం.

వయసును బట్టి ఎంతసేపు నిద్రపోవాలి? 

నవజాత శిశువులు మొదటి త్రైమాసికంలో కనీసం 11 గంటల పాటైనా నిద్రపోవాలి. వీరు ఎక్కువగా 14-17 గంటలు నిద్రపోవాలని సిఫార్సు చేయబడింది. నాలుగు నెలల నుంచి ఏడాది వయసున్న పిల్లలు కనీసం పది గంటలు నిద్రపోవాలి. వీరు గరిష్ఠంగా 12-15 గంటలు నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. ఒకటి నుంచి రెండు సంవత్సరాల మధ్యున్న పిల్లలు తొమ్మిది గంటల నిద్రపోవాలి. వీళ్లు గరిష్టంగా 11-14 గంటల నిద్రపోవాలని సిఫార్సు చేయబడింది. మూడు నుంచి ఐదేళ్ల మధ్య కనీసం 8 గంటలు, గరిష్టంగా 10-13 గంటలు నిద్రపోవాలని సిఫార్సు చేయబడింది. ఆరేండ్ల వయసు దాటిన తర్వాత పిల్లలు రోజూ ఎనిమిది గంటల నిద్ర ఖచ్చితంగా నిద్రపోవాలి. 

పిల్లలు వారి శరీరానికి అవసరమైనంత నిద్రపోకపోతే వారి ఎదుగుదల దెబ్బతింటుంది. నిజానికి పిల్లలు ఎక్కువగా పగటిపూట నిద్రపోతారు. కానీ దీనివల్ల వారు అలసిపోయినట్టుగా ఉంటారు. అలాగే ఏదైనా నేర్చుకోవడంతో ఇబ్బంది పడతారు. దీనివల్ల వారు రాత్రిపూట సరిగ్గా నిద్రపోలేరు. 

రాత్రిపూట పిల్లలు బాగా నిద్రపోవాలంటే ఏం చేయాలి?

  • పిల్లల్ని సరైన సమయానికే పడుకోబెట్టాలి. 
  • అలాగే మీ పిల్లలు నిద్రపోవడానికి అనువైన వాతావరణాన్ని కల్పించాలి. అంటే రూం లో ఎక్కువ వెలుతురు ఉండకుండా చూసుకోవాలి.
  • తల్లిపాలివ్వడం వల్ల కూడా నవజాత శిశువులు తొందరగా నిద్రపోతారు. 
  • కొంతమంది పిల్లలు తమ భుజం మీద పడుకోబెట్టుకుని ఊపి నిద్రపుచ్చుతారు. ఈ ట్రిక్ కూడా పిల్లలు తొందరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. కానీ చాలా మంది భుజంపై నుంచి పిల్లల్ని ఊయల్లో వేస్తుంటారు. కానీ దీనివల్ల పిల్లలు నిద్రలేస్తారు. నిజానికి తల్లిశరీరం పిల్లలకు వెచ్చగా ఉంటుంది. పిల్లల్ని ఊయల్లో వేసినప్పుడు పిల్లలకు చల్లగా ఉంటుంది. దీనివల్ల వారు నిద్రలేస్తారు. అందుకే పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు తల్లులు కొద్దిసేపు వారితో పడుకోవాలి.
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios