Asianet News TeluguAsianet News Telugu

పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారా..? ముందు చేయాల్సింది ఇదే..!

మీరు ఎలాంటి డాక్టర్స్ చుట్టూ తిరగకుండా.. ఫెర్టిలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే... మీ డైట్ లో ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఏవి తింటే.. ఆరోగ్యకరమైన సంతానం మీకు లభిస్తుందో తెలుసుకుందాం...

Want To Start A Family? 7 Nuts And Seeds That Can Boost Your Fertility ram
Author
First Published Sep 30, 2024, 10:37 AM IST | Last Updated Sep 30, 2024, 10:54 AM IST

పెళ్లి తర్వాత దంపతులు సంతానం కావాలని కోరుకుంటారు. ఒకప్పుడు అంటే.. పిల్లలను కనడం అనేది చాలా సులభంగా ఉండేది. ఒక్కో జంట తక్కువలో తక్కువ నలుగురు, ఐదుగురు ని కనేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక్కరిని కనడం కూడా చాలా కష్టంగా మారిపోయింది. చాలా మంది మహిళలకు  గర్భం దాల్చడం కూడా కష్టంగా మారిపోయింది. అందుకే... హాస్పిటల్స్ చుట్టూ తిరగకుండా.. పిల్లలను కనడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. మీరు నిజంగా పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారంటే.... కచ్చితంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ డైట్ లో పోషకాహారాలు ఉండేలా చూసుకోవాలి. మీరు ఎలాంటి డాక్టర్స్ చుట్టూ తిరగకుండా.. ఫెర్టిలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే... మీ డైట్ లో ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఏవి తింటే.. ఆరోగ్యకరమైన సంతానం మీకు లభిస్తుందో తెలుసుకుందాం...

Want To Start A Family? 7 Nuts And Seeds That Can Boost Your Fertility ram

సంతానోత్పత్తిని పెంచే ఆహారాలు ఏవి..?

మనం తీసుకునే ఆహారాలు మన సంతానోత్పత్తిపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి.  ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ తో కూడిన పోషకాలు అధికంగా ఉండే పదార్థాలను మనం ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల.. హార్మోన్ల బ్యాలెన్స్ బాగుంటుంది. పునరుత్పత్తి పనితీరు కూడా మెరుగుపడుతుంది. మొత్తంగా సంతానోత్పత్తిని పెంచడంలోనూ సహాయపడుతుంది.  అందుకే.. అన్ని అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉండే బ్యాలెన్స్డ ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అంటే... ఆ డైట్ లో పండ్లు, కాయలు, కూరగాయలు, నట్స్ ఇలా అన్నీ ముఖ్యంగా ఉండేలా చూసుకోవాలి.  ముఖ్యంగా.. ఈ కింది పేర్కొన్న ఫుడ్స్ ని కచ్చితంగా డైట్ లో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 

స్త్రీ, పురుషుల్లో సంతానోత్పత్తి పెంచే ఫుడ్స్...

1.అవిసె గింజలు...
అవిసె గింజలు చూడటానికి చిన్నగానే కనిపిస్తాయి. కానీ.... సంతానోత్పత్తి, పునరుత్పత్తి వ్యవస్థను బలపరచడంలో కీలకంగా పని చేస్తాయి.  మీరు ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ లో ఓట్ మీల్ లో... ఈ అవిసె గింజలను కలిపి తీసుకోవాలి. లేదంటే... మంచి స్మూతీ ప్రిపేర్ చేసుకొని అందులో వీటిని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే.. రాత్రిపూట నానపెట్టి.. ఉదయాన్నే తీసుకున్నా సరిపోతుంది.

.2. గుమ్మడి గింజలు: జింక్ పుష్కలంగా, గుమ్మడి గింజలు ఋతు చక్రం  రెండవ దశలో ప్రొజెస్టెరాన్ స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వాటిని సలాడ్‌లపై కరకరలాడే టాపింగ్‌గా ఆస్వాదించండి లేదా రుచికరమైన ట్రీట్ కోసం ఇంట్లో తయారుచేసిన గ్రానోలాలో వాటిని చేర్చండి.

Want To Start A Family? 7 Nuts And Seeds That Can Boost Your Fertility ram

3. నువ్వులు: జింక్ , సెలీనియంతో లోడ్ చేసిన నువ్వులు హార్మోన్ల ఉత్పత్తికి అవసరం. స్టైర్-ఫ్రైస్‌లో నువ్వుల గింజలను చల్లుకోండి. నువ్వుల చెక్కీ కూడా తినొచ్చు. లేదంటే.. మీకు నచ్చిన ఫుడ్స్ లో.. నువ్వులు యాడ్ చేసుకొని అయినా తినొచ్చు. కానీ... ఏదో ఒక రూపంలో.. నువ్వులను మాత్రం మీ డైట్ లో భాగం చేసుకోవాలి. 

4. పొద్దుతిరుగుడు విత్తనాలు: విటమిన్ ఇ.. పొద్దుతిరుగుడు గింజల్లో పుష్కలంగా ఉంటుంది.   పొద్దుతిరుగుడు విత్తనాలు ప్రొజెస్టెరాన్ ఉత్పత్తికి మద్దతు ఇస్తాయి. కాలేయంలో అదనపు ఈస్ట్రోజెన్‌ను నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి. వీటిని స్నాక్స్ రూపంలో లేదంటే...  మరేదైనా రూపంలో.. మీ డైట్ లో భాగం చేసుకుంటే సరిపోతుంది.

5. వాల్‌నట్‌లు: ఈ మెదడు ఆకారంలో ఉండే గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి, ఇవి హార్మోన్లను నియంత్రించడంలో, పునరుత్పత్తి ఆరోగ్యానికి తోడ్పడతాయి. మీ బేకింగ్ వంటకాలలో వాల్‌నట్‌లను చేర్చండి లేదా వాటిని సొంతంగా సంతృప్తికరమైన స్నాక్‌గా ఆస్వాదించండి.

6.బాదం: విటమిన్ ఇ  మరొక మూలం, బాదం వాటి హార్మోన్-బ్యాలెన్సింగ్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. మిడ్-మార్నింగ్ స్నాక్‌గా కొన్ని బాదంపప్పులను ఆస్వాదించండి లేదారాత్రిపూట బాదం పప్పు నానపెట్టి.. ఉదయాన్నే వాటిని తింటే సరిపోతుంది.

7. చియా విత్తనాలు: ఈ చిన్న గింజలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల పవర్‌హౌస్, హార్మోన్ నియంత్రణ , పునరుత్పత్తి ఆరోగ్యానికి అవసరం. రుచికరమైన , పోషకాలతో కూడిన ట్రీట్ కోసం చియా గింజలను పెరుగు లేదా పుడ్డింగ్‌లో కలపండి. చూడటానికి చిన్నగా ఉన్నా.. ఈ గింజలు.. మీ ఫెర్టిలిటీపై చాలా గొప్ప ప్రభావం చూపిస్తాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios