Asianet News TeluguAsianet News Telugu

ప్రెగ్నెన్సీ టైంలో పాదాల వాపు.. తగ్గాలంటే ఇలా చేయండి

ప్రెగ్నెన్సీ సమయంలో పాదాల్లో వాపు రావడం చాలా కామన్. కానీ దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో పాదాల వాపును తగ్గించుకోవచ్చు. 
 

how to reduce swollen feet during pregnancy
Author
First Published Mar 9, 2023, 12:33 PM IST


ప్రెగ్నెన్సీ సమయంలో పాదాల వాపు వస్తుందని చాలా మంది అంటుంటారు.  ఇది నిజమే. కానీ పాదాల వాపు వల్ల నడవడానికి, ఏ పనిచేయాలన్నా ఇబ్బంది కలుగుతుంది. అయితే కొన్ని  సింపుల్ చిట్కాలతో ఈ పాదాల వాపును సులువుగా తగ్గించుకోవచ్చు. 

ప్రతి నలుగురి గర్భిణుల్లో ముగ్గురు పాదాల వాపుతో బాధపడుతున్నారు. పాదాల వాపు సాధారణంగా రెండవ త్రైమాసికంలో ప్రారంభమవుతుంది. కాలం గడుస్తున్న కొద్దీ ఈ సమస్య మరింత పెరుగుతుంది. సాధారణంగా ఈ సమస్య వేసవికాలంలోనే ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు ఉన్నా.. కవలపిల్లలు పుట్టబోయే వారికి ఎడెమా వచ్చే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. 

ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. ఈ అదనపు నీరు  శిశువు, మావి, అమ్నియోటిక్ ద్రవం, తల్లి రక్తంలోకి వెళుతుంది. ఇది గర్భాశయం కటి సిరపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ ఒత్తిడి వల్ల గుండెకు రక్తం సరిగ్గా పంప్  చేయలేక పాదాలలో ద్రవం పేరుకుపోవడం మొదలవుతుంది. దీనివల్ల పాదాలు ఉబ్బుతాయి. మరి ఈ వాపును ఎలా తగ్గించుకోచ్చంటే..

పాదాలను చురుకుగా ఉంచాలి

గర్భధారణ సమయంలో పాదాల వాపు రాకూడదంటే ప్రతిరోజూ కొంత సమయం మీ పాదాలను పైకి ఉంచండి. కూర్చున్నప్పుడు మీ పాదాల కింద రెండు నుంచి మూడు దిండ్లను పెట్టండి. కుర్చీలో  కూర్చున్నా మీ పాదాలను నేరుగా మంచంపై ఉంచొచ్చు. దీనితో పాటు మీరు పడుకునేటప్పుడు మీ చీలమండలను వృత్తాకార కదలికలో కదిలించండి. 

సోడియాన్ని తక్కువగా తీసుకోండి 

గర్భధారణ సమయంలో పాదాల వాపును తగ్గించుకోవడానికి సోడియం తీసుకోవడాన్ని తగ్గించండి. ఉప్పు మీ శరీరంలో నీటిని అలాగే నిల్వ  ఉంచుతుంది. అందుకే మిఠాయి, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని పూర్తిగా నివారించండి. అలాగే సలాడ్, పెరుగు, రైతా వంటి ఆహారాలకు సాల్ట్ ను ఎక్కువగా కలపకూడదు. చట్నీలు, చిప్స్, స్ట్రీట్ ఫుడ్స్ వంటి ఉప్పు  ఎక్కువగా ఉండే ఆహారాలను పూర్తిగా నివారించండి.

పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినండి

శరీరానికి తగినంత పొటాషియం లభించకపోవడం వల్ల కూడా కాళ్లు వాపు వస్తాయి. పొటాషియం శరీరంలో ఉన్న ద్రవం మొత్తాన్ని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. అందుకే పొటాషియం ఉన్న  ఆహారాన్ని తినండి. బంగాళాదుంపలు, చిలగడదుంపల తొక్కల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటిని తొక్కలతో తినండి. దానిమ్మ నారింజ, క్యారెట్ జ్యూస్ వంటి కొన్ని పండ్ల రసాలను డైట్ లో చేర్చుకోవచ్చు. అరటిపండు, పాలకూర బీన్స్, బీట్ రూట్ పప్పు, పెరుగులో కూడా పొటాషియం ఉంటుంది. 

నడక

నడక గర్భధారణకు సురక్షితమైన వ్యాయామంగా పరిగణించబడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం ప్రతిరోజూ కనీసం 15 నిమిషాలైనా  నడవాలని వైద్యులు సూచిస్తున్నారు.

పాదాల మసాజ్

గర్భధారణ సమయంలో మీ పాదాలు వాపు వస్తే నూనెతో మసాజ్ చేయండి. వాపు తగ్గుతుంది. మసాజ్ రక్త ప్రసరణను పెంచుతుంది. దీనివల్ల వాపు తగ్గి నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. 

కెఫిన్ ను ఎక్కువగా తీసుకోకూడదు

కెఫిన్ మిమ్మల్ని రిలాక్స్  గా చేసినా దీన్ని మోతాదుకు మించి తీసుకుంటే గర్భధారణలో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. వాటిలో ఒకటి ఎడెమా సమస్య. కెఫిన్ కారణంగా పదేపదే బాత్రూంకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో మీ శరీరం మూత్రాన్ని పట్టిఉంచేలా చేస్తుంది. దీనివల్ల పాదాల వాపు పెరుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios