డయాబెటీస్ ఉన్న పిల్లల్ని ఎలా చూసుకోవాలి?

పెద్దలకే కాదు పసి పిల్లలకు కూడా టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ వస్తోంది. ఇది దీర్ఘకాలికి సమస్య. ఇది మనం బతికున్నంత వరకు మనతోనే ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్న పిల్లల్ని పేరెంట్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 

diabetic kids care tips rsl


అనారోగ్యకరమైన ఆహారం, చెడు జీవనశైలి ప్రభావాలు మిమ్మల్ని రోగాల బారిన పడేయడమే కాకుండా.. భవిష్యత్తు తరాలను కూడా ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే కొన్ని వ్యాధులు మీ ముందు తరాలకు కూడా జన్యుపరంగా వస్తాయి కాబట్టి. నిష్క్రియాత్మక జీవనశైలి గుండె జబ్బులు, డయాబెటీస్, అధిక రక్తపోటు వంటి ఎన్నో వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతోంది. ప్రతి వ్యాధి డేంజరే. ముఖ్యంగా డయాబెటిస్. ప్రస్తుత కాలంలో చాలా మంది పిల్లలు డయాబెటీస్ బారిన పడుతున్నారు. 

డయాబెటిస్ ని మధుమేహం, షుగర్ వ్యాధి అని కూడా పిలుస్తారు. దీనిలో టైప్-1, టైప్-2 అనే రెండు రకాలు ఉన్నాయి. పిల్లలు, యువత ఎక్కువగా టైప్ -1 డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఎందుకంటే ఇది జన్యుపరమైనది. వీరికి అదనపు సంరక్షణ చాలా అవసరం. లేదంటే వీరి ఆరోగ్యం మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే టైప్ -1 డయాబెటిస్ ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టైప్-1 డయాబెటిస్ తో బాధపడుతున్న పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచడంలో శారీరక కార్యకలాపాలు బాగా సహాయపడతాయి. అందుకే ఈ సమస్య ఉన్న పిల్లల్ని ప్రతి తల్లిదండ్రులు ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు పాటు పిల్లలను వ్యాయామం చేసేలా చూడాలి. ఇది పిల్లల రక్తంలో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది. అలాగే ఇన్సులిన్ సున్నితత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. డయాబెటీస్ ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలో తెలుసా? 

బ్లడ్ షుగర్ లెవెల్స్ చెకింగ్: పిల్లల రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి తల్లిదండ్రులు ఈ పరికరాన్ని ఇంట్లో ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఈ పరికరాలు రీడింగ్ లను చూడటానికి మొబైల్ ఫోన్ కు కనెక్ట్ చేయాలి. దీనివల్ల మీ పిల్లల హెల్త్ కండీషన్  గురించి తెలుసుకోగలుగుతారు. 

శారీరక శ్రమ: డయాబెటీస్ ఉన్న పిల్లలు శారీరక శ్రమ ఎక్కువగా చేయాలి. ఇందుకోసం డ్యాన్స్, సైక్లింగ్, క్రికెట్ లేదా కబడ్డీ వంటి ఫన్నీ కార్యకలాపాల్లో మీ పిల్లలను నిమగ్నం చేయండి. వీటితో వాళ్లను మీరు హెల్త్ కోసం బలవంతం చేయాల్సిన అవసరం లేదు. వీటితో పాటుగా మీ పిల్లలు బాగా నిద్రపోయేలా చూసుకోవాలి. లేదంటే మీ పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది. 

ఆరోగ్యకరమైన స్నాక్స్ 

డయాబెటిస్ పేషెంట్లు హెల్తీ భోజనం చేయాలి. హెల్తీ స్నాక్స్ తిన్న తర్వాత బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగవు. గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతుంటే వాటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయండి. పాప్ కార్న్, పెరుగు, ద్రాక్ష, గుడ్లను తినండి. ఇవి డయాబెటీస్ పేషెంట్లకు మేలు చేస్తాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios