హ్యాపీ చిల్డ్రన్స్ డే.. మీ పిల్లలకు తెలుగులో బాలల దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి
childrens day 2023 : ప్రతి ఏడాది నవంబర్ 14 న భారతదేశంలో బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరి ఈ సందర్భంగా పిల్లలకు ఎలా శుభాకాంక్షలు చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం..
childrens day 2023 : చాచా నెహ్రూగా ప్రసిద్ధి చెందిన భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతిని మనం ప్రతి ఏటా నవంబర్ 14న జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. నిజానికి బాలల దినోత్సవం అనేది జస్ట్ ఒక తేదీ మాత్రమే కాదు. ఇది పిల్లల ఆనందం, అమాయకత్వం, ప్రతి పిల్లవాడిలో దాగున్న సామర్థ్యానికి ఇదొక వేడుక. మరి ఈ స్పెషల్ డే నాడు పిల్లలలకు ఎలా విషెస్ చెప్పాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
- హ్యాపీ చిల్డ్రన్స్ డే.. మీ కలలు మీ చిరునవ్వులంత పెద్దవిగా ఉండాలి. మీ భవిష్యత్తు సూర్యుని లాగే వెలిగిపోతూ ఉండాలి.
- భావితరాల నాయకులు, ఛేంజ్ మేకర్లూ మీరే.. రేపటి ప్రపంచ సంరక్షకులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు!
- నీ కళ్లలోని అమాయకత్వం, నీ గుండెల్లోని స్వచ్ఛత ఎప్పటికీ అలాగే ఉండాలి. నా చిన్ని పిల్లలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు!
- ఈ ప్రపంచం నీ కలలకు ఆటస్థలంగా ఉండాలి. మీరెప్పుడూ నవ్వుతూనే ముందుగా సాగాలని కోరకుంటున్నా నాన్నా.. హ్యాపీ చిల్డ్రన్స్ డే.
- పిల్లలు నవ్వులే ప్రపంచానికి అందాన్ని తీసుకొస్తాయి. వారి అమాయకత్వం, నవ్వులు మన జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. హ్యాపీ చిల్డ్రన్స్ డే.
- జీవితమనే తోటలో అద్వితీయమైన పువ్వులు పిల్లలు. ప్రతి పిల్లవాడు ప్రత్యేకమైనవాడే. రేపటి భవిష్యత్తుకు కాబోయే నాయకులే పిల్లలు. హ్యాపీ చిల్ట్రన్స్ డే.
- "మన పిల్లలకు మంచి భవిష్యత్తు కోసం మనం ఈ రోజును త్యాగం చేద్దాం. - ఏపీజే అబ్దుల్ కలాం
- భగవంతుడు మనిషిని ఇంకా నిరుత్సాహపరచలేదనే సందేశంతో ప్రతి పిల్లవాడు వస్తాడు."- రవీంద్రనాథ్ ఠాగూర్
- మన పిల్లలను పెంచే విధానమే మన దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. - పండిట్ జవహర్ లాల్ నెహ్రూ
- పిల్లలను మంచివారిగా తీర్చిదిద్దడానికి ఉత్తమ మార్గం వారిని సంతోషంగా ఉంచడమే - ఆస్కార్ వైల్డ్
- పిల్లలు ప్రపంచంలోని అత్యంత విలువైన వనరులు. - జాన్ ఎఫ్ కెన్నడీ
- మీ పిల్లలకు మీరు ఇవ్వగల గొప్ప బహుమతులు బాధ్యత మూలాలు, స్వాతంత్య్రాన్ని ఇవ్వడం. - డెనిస్ వెయిట్లీ
- "పిల్లలు తడి సిమెంట్ లాంటివారు. వాటిపై ఏది పడితే అది ప్రభావం చూపుతుంది. " - హైమ్ గినోట్
- "మనం మన పిల్లలకు జీవితం గురించి బోధించడానికి ప్రయత్నిస్తాం.. కానీ పిల్లలు జీవితమంటే ఏంటో మనకు బోధిస్తారు. " - ఏంజెలా ష్విండ్ట్